Tomato Soup: రోగనిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతమైన సూప్.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
టమాటాలో ఉండే 'లైకోపీన్' అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. టమాటో సూప్‌లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. కాన్సర్ బారినపడకుండా ఉండేందుకు టమాటో ఉపయోగపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుందేకు కూడా సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

టమాటా సూప్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమంగా వర్షాకాలం, చలికాలంలో బాగా పని చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి కాపాడడానికి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు టమాటా సూప్‌ను తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. టమాటాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో సీజనల్ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేలా చేస్తుంది.
టమాటాల్లో క్రోమియం, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, లుటిన్, లైకోపీన్ కెరోటినాయిడ్స్ వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి స్థూలకాయానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి కణాలను రక్షిస్తాయి. టమాటాల్లో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ కంట్రోల్ కు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం, బరువు తగ్గడానికి టమోటో సూప్ దోహదపడుతుంది.
టమాటో సూప్‌లోని లైకోపీన్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమాటాలో ఉండే ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. టమాటో సూప్‌లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి ఫలితాలను ఇస్తుంది. కాన్సర్ బారినపడకుండా ఉండేందుకు టమాటో ఉపయోగపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుందేకు కూడా సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








