AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో బ్రదర్ ఇది మెట్రోరైల్‌.. మీ బెడ్‌రూమ్‌ అనుకుంటున్నారేమో..! దర్జాగా పడకేసిన ప్రయాణికులు..

దేశవ్యాప్తంగా మెట్రో సేవ‌లు వేగంగా విస్త‌రిస్తున్నాయి. ఇత‌ర దేశాల‌తో పోల్చితే మ‌న దేశంలో మెట్రో ఆల‌స్యంగా అందుబాటులోకి వ‌చ్చినా అభివృద్ధి మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే మెట్రోకు సంబంధించి రకరకాల వార్తలు, వీడియోలో సోషల్ మీడియాలో తరచుగా వైరల్‌ అవుతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైన విషయం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

హాలో బ్రదర్ ఇది మెట్రోరైల్‌.. మీ బెడ్‌రూమ్‌ అనుకుంటున్నారేమో..! దర్జాగా పడకేసిన ప్రయాణికులు..
Metro Passenger
Jyothi Gadda
|

Updated on: Jul 29, 2025 | 12:56 PM

Share

ఢిల్లీ మెట్రోలో ప్రయాణించడానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు కొంతమంది మెట్రోలోకి ప్రవేశిస్తారు. వారు నియమాలను విస్మరించి తమ సొంత సౌకర్యాన్ని కోరుకుంటారు. అలాంటివే ఢిల్లీ మెట్రోకు సంబంధించి గతంలోనూ చాలా వీడియోలు వైరల్‌ కావటం చూశాం. మెట్రోలో యువతీ యువకులు చేస్తున్న పనులు తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురిచేసేవిగా ఉంటున్నాయి. అలాంటిదే ఈసారి కూడా జరిగింది. ఢిల్లీ మెట్రోలో సీట్లు, నేలపై ప్రయాణికులు హాయిగా పడుకుని నిద్రపోతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. దీనిపై DMRC కూడా స్పందించింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫోటోలలో ప్రయాణికులు చేసిన పనివల్ల ఇతర ప్రయాణీకులు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చిందని భావించారు.

ఢిల్లీ మెట్రో పింక్ లైన్ లో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. మెట్రో రైల్లో ప్రయాణికులు సీటుపై పడుకుని ప్రయాణించడం కనిపిస్తుంది. @ishtyak అనే యూజర్ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఇలా వ్రాశాడు . ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ మెట్రోలోని మజ్లిస్ పార్క్ వైపు వెళ్తున్న పింక్ లైన్‌లో ఇలాగే జరుగుతోందని చెప్పారు. దీనికి ప్రతిస్పందిస్తూ @OfficialDMRC పోస్ట్ చేసి రాశారు. హలో, ఏదైనా అసౌకర్యానికి క్షమించండి. తదుపరి చర్య కోసం దయచేసి రైలు ID మీ లోకేషన్‌ని షేర్ చేయండి అంటూ సూచించారు.

వైరల్‌ ఫోటోలో ఒక వ్యక్తి రైలు ఫ్లోర్‌పై హాయిగా పడుకుని, హ్యాపీగా మొబైల్‌ఫోన్‌ చూస్తున్నాడు. బాహుశ అతడు ఇది మెట్రో అని మర్చిపోయి ఉంటాడని, తన మామగారి ఇల్లు అనుకుంటున్నారేమో అంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు. @MdShahbaz476868 అనే యూజర్ ఈ ఫోటోను పోస్ట్ చేసి, DMRC ని ట్యాగ్ చేసి, ఇది ఏమిటి అని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా, DMRC అదే విషయాన్ని రాసింది. ఢిల్లీ మెట్రోలో ప్రజలు కూర్చుని, పడుకున్న వీడియోలు, ఫోటోలు గతంలో కూడా వైరల్ అయ్యాయి . దీనిపై చర్య తీసుకోవడానికి, DMRC వాహనానికి సంబంధించిన వివరాలను ప్రయాణికులను కోరింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…