AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భారీ కొండ చిలువపై ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నం.. అది పెంపుడు జంతువు కాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని చిన్నరులకు, జంతువులకు ఉన్న ప్రేమని బంధాన్ని తెలియజేసేవిగా ఉంటున్నాయి. అటువంటి వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తెగ షేర్ చేస్తూ తమ ఆనందాన్ని తెలుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే వెన్నులో వణుకు వస్తుంది. ఎందుకంటే ఒక చిన్నారి బాలిక బోసి నవ్వులు నవ్వుతూ పెద్ద కొండ చిలువతో ఆడుకుంటుంది.

Viral Video: భారీ కొండ చిలువపై ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నం.. అది పెంపుడు జంతువు కాదంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..
Viral Video
Surya Kala
|

Updated on: Jul 29, 2025 | 1:59 PM

Share

సోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక చిన్నారి బాలిక ఒక భారీ కొండచిలువపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను భయపెడుతోంది. ఈ వీడియోలో ఇంటి బయట ఉంచిన సోఫాపై ఒక పెద్ద కొండచిలువ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ కొండచిలువ సోఫాపై ఎక్కి అవతలి వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అప్పుడు ఇంట్లో ఉన్న ఒక చిన్న బాలిక ఆ కొండ చిలువని గమనించింది.

అయితే ఆశ్చర్యంగా అంత పెద్ద కొండచిలువను చూసి భయంతో బాలిక పారిపోలేదు.. సరి కదా.. ఆ అమ్మాయి నవ్వుతూ దాని దగ్గరికి వెళ్లి దానిపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. అసలు ఆ బాలిక ఏదో ఒక ఆట బొమ్మ లేదా వాహనం అన్నట్లుగా కొండచిలువ మీదకు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. అదే సమయంలో ఆ కొండచిలువ మెల్లగా పాకుతూ మరొక వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అదే సమయంలో.. ఆ బాలిక కూడా బోసి నోటితో నవ్వుతూ కొండ చిలువపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూస్తుంటే.. ఇలా కొండ చిలువ మీద బాలిక ఎక్కడానికి చేస్తున్న ప్రయత్నాన్ని సమీపంలో ఉన్న ఎవరో వీడియో తీస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడిది? వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరు అనేది ఇంకా తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు. బాలిక క్షేమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు నవ్వుతుంది.. తర్వాత ఏడుస్తుంది ఒకరు కామెంట్ చేయగా.. కొండ చిలువ పెంపుడు జంతువు కాదు జాగ్రత్త సుమా అని మరొకరు .. ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులు నిర్లక్షమే అంటూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ నెటిజన్లు బాలిక రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..