AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips:ఆ యువతి కేవలం 7 నెలల్లో 35 కిలోలు తగ్గింది.. ఎలా సాధ్యమయ్యిందంటే..?

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ఊబకాయం, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నావారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం అంటే బరువు తగ్గడానికి సరైన ఆహారం, వ్యాయామంతో పాటు అనేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తినే విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ఎందుకంటే నచ్చిన ఆహారం తినేస్తూ పొతే బరువు తగ్గడంలో సమస్యలను కలిగిస్తుంది. ఈ రోజు ఒక యువతి తినే ఆహారంలో మార్పు చేసుకుని కేవలం కేవలం 6 నెలల్లో 35 కిలోలు తగ్గింది. ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Weight Loss Tips:ఆ యువతి కేవలం 7 నెలల్లో 35 కిలోలు తగ్గింది.. ఎలా సాధ్యమయ్యిందంటే..?
Weight Loss Transformation
Surya Kala
|

Updated on: Aug 05, 2025 | 1:33 PM

Share

నేటి కాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనిగా మారుతోంది. అయితే సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే.. బరువు తగ్గడం అంత కష్టమైన పని కాదు. బరువు తగ్గడంలో వ్యాయామం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు ఈ సమయంలో శరీర అవసరాలకు అనుగుణంగా తినే ఆహారంలో మార్పులు చేర్చుకోవాలి. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి బరువు పెరగడానికి కారణమవుతాయి.

బరువు తగ్గడంలో తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిరంతరం అధిక కొవ్వు లేదా కేలరీలు ఉన్న ఆహారాన్ని తింటుంటే.. బరువు తగ్గడం చాలా కష్టం. ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా 7 నెలల్లో 35 కిలోల బరువు తగ్గిన విషయాన్ని చెబుతూ తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. దీనిలో బరువు తగ్గేటప్పుడు వేటికి దూరంగా ఉండాలో ఆమె చెప్పింది.

ఇవి కూడా చదవండి

గ్రానోలా రోల్డ్ ఓట్స్, గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్‌, తేనె లేదా ఇతర తీపి పదార్థాలు, కొన్నిసార్లు పఫ్డ్ రైస్ తో గ్రానోలాను తయారు చేస్తారు. అందుకే దీనిని ఆరోగ్యకరమైన ఆహారం అని పిలుస్తారు. ఎక్కువగా స్నాక్‌గా తినడానికి ఇష్టపడతారు. అయితే గ్రానోలాలో చక్కెర, అనారోగ్యకరమైన నూనె ఉంటుంది. కనుక దీనిని తినడం వలన బరువు తగ్గడంలో సమస్యలు ఉండవచ్చు.

ఫ్లేవర్ పెరుగు ప్రస్తుతం చాలా మంది ఫ్లేవర్ పెరుగు తినడానికి ఇష్టపడుతున్నారు. పండ్లు, చక్కెర, సహా అనేక ఇతర వస్తువులతో ఫ్లేవర్ పెరుగుని తయారు చేస్తారు. దీనిలో చక్కెర ఉంటుంది. కనుక దీనిని తినడం వలన ఇన్సులిన్‌ పెరుగుతుంది. కొవ్వును కూడా పెంచుతుంది.

ప్యాక్ చేసిన పండ్ల రసం ప్యాక్ చేసిన పండ్ల రసాలలో ఫైబర్ తక్కువగా, చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని పండ్ల రసాల్లో సోడా కలుపుతారు. అందువల్ల బరువు తగ్గాలానుకునే వారు ప్యాక్ చేసిన పండ్ల రసాలను తీసుకోవడం మానుకోవాలి.

స్మూతీ ఇంట్లో తయారుచేసిన స్మూతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే బయట తయారుచేసిన లేదా ప్యాక్ చేసిన స్మూతీలలో పండ్లు, చక్కెర, కృత్రిమ రుచులు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి.

డైట్ సాల్టెడ్, బేక్డ్ చిప్స్ డైట్ స్నాక్స్ , బేక్డ్ చిప్స్ ఆరోగ్యకరమైనవిగా భావిస్తారు. అయితే వీటిల్లో ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల వీటిని బరువు తగ్గాలనుకునే వారు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహరంలో కార్బోహైడ్రేట్లలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉంటాయి.

View this post on Instagram

A post shared by LeanwithNeha (@leanwithneha)

బెల్లం, తేనె బెల్లం, తేనె రెండూ ఆరోగ్యకరమైనవే. అయితే ఈ రెండింటిలోనూ అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. కనుక బరువు తగ్గే సమయంలో ఈ రెండింటినీ నివారించాలి.

సోయా ఉత్పత్తులు, ఈ వస్తువులు సోయా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరం అని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. దీనితో పాటు బ్రౌన్ బ్రెడ్ , ప్రోటీన్ బార్‌లకు దూరంగా ఉండాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)