Healthiest Chapatis: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ ఐదు ఫ్లేవర్ల చపాతీలు ట్రై చేయండి.!

Healthiest Chapatis Lose Weight: బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత..

Healthiest Chapatis: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.? ఈ ఐదు ఫ్లేవర్ల చపాతీలు ట్రై చేయండి.!
Roti
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2021 | 1:49 PM

Healthiest Chapatis Lose Weight: బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి, అలాగే బరువు తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలామంది యువత ఎక్కువగా రాత్రి వేళల్లో చపాతీలు తింటుంటారు. అయితే రెగ్యులర్‌గా తినే చపాతీల వల్ల బరువు తగ్గే అవకాశం ఉండదని కొందరిలో అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ఐదు రకాల పిండి పదార్ధాలతో చపాతీలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.

Ragi Flour Roti

Ragi Flour Roti

రాగి పిండి:(Ragi Flour): ఆరోగ్యకరమైన, సాంప్రదాయకంగా అందరూ ఇష్టపడే ధాన్యాల్లో ‘రాగి’ ఒకటి. ఐరన్, కాల్షియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉండే రాగిని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగితో చేసిన రోటిస్ సులభంగా జీర్ణమవుతాయి.

Almond Flour Roti

Almond Flour Roti

బాదం పిండి:(Almond Flour): బాదం పోషకాహారానికి గొప్ప మూలం. ఒకవేళ మీరు కిటోజెనిక్ డైట్‌ను అనుసరిస్తుంటే, బాదం పిండితో చేసిన రోటిస్ తినడం చాలా ఉత్తమం. బాదంపప్పులో తక్కువ ఫైటిక్ యాసిడ్ ఉంటుంది, అది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.

Bajra Flour Roti

Bajra Flour Roti

బజ్రా పిండి:(Bajra Flour): మీరు గ్లూటెన్ లేని, ఫైబర్ అధికంగా ఉండే చపాతీ కోసం చూస్తున్నట్లయితే, మీ డైట్‌లో బజ్రా రోటిస్ యాడ్ చేయండి. బజ్రా పిండి చపాతీలలో మెగ్నీషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

Jowar Roti

Jowar Roti

జోవర్ పిండి:(Jowar Flour): సాధారణ గోధుమ చపాతీల కంటే జోవర్ పిండితో చేసిన చపాతీలు ఎంతో ఆరోగ్యకరం. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. జోవర్ జీర్ణక్రియను మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది.

Normal Roti

Normal Roti

వోట్ పిండి(Oat Flour): బరువు తగ్గించే అద్భుతమైన ఆహార పదార్ధం వోట్స్. ఇందులో బి-విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే కంటెంట్ వోట్స్‌లో పుష్కలంగా ఉంటాయి.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!