Kitchen Hacks: పిల్లల యూనిఫాం తెల్లగా మెరిసి పోవాలంటే ఇలా ఉతకండి..

చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్తే బట్టలు ఎలా మురికిగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చెప్పి స్కూల్‌కి పంపించినా కూడా బట్టలు చాలా మురికిగా మారిపోతాయి. మచ్చలు, పెన్ను గీతలు, చాక్లెట్ మరకలు, బురద, ఫుడ్ మరకలు ఇలా ఎన్నో మరకలు చేస్తారు. వీటిని వదిలించడం తల్లులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే ఇవి అంత త్వరగా వదిలి పోవు. ఎంతలా రుద్ది ఉతికినా మరకలు పోవు. తెలుపు బట్టలు కాస్తా పసుపు రంగులోకి..

Kitchen Hacks: పిల్లల యూనిఫాం తెల్లగా మెరిసి పోవాలంటే ఇలా ఉతకండి..
Kitchen Hacks
Follow us
Chinni Enni

|

Updated on: Sep 26, 2024 | 12:01 PM

చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్తే బట్టలు ఎలా మురికిగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత చెప్పి స్కూల్‌కి పంపించినా కూడా బట్టలు చాలా మురికిగా మారిపోతాయి. మచ్చలు, పెన్ను గీతలు, చాక్లెట్ మరకలు, బురద, ఫుడ్ మరకలు ఇలా ఎన్నో మరకలు చేస్తారు. వీటిని వదిలించడం తల్లులకు పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే ఇవి అంత త్వరగా వదిలి పోవు. ఎంతలా రుద్ది ఉతికినా మరకలు పోవు. తెలుపు బట్టలు కాస్తా పసుపు రంగులోకి మారతాయి. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని రకాల చిట్కాలు ఫాలో చేస్తే.. పిల్లల తెల్ల బట్టలు అలాగే ఉంటాయి. మల్లెపువ్వులా మెరుస్తాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నిమ్మకాయ:

నిమ్మకాయ బెస్ట్ క్లీనర్‌గా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో ఎలాంటి వాటిని అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బ్లీచింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయతో ఎలాంటి మొండి మరకలు అయినా సులువగా పోతాయి. నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేసి.. యూనిఫాం మీద మరకలు అయినా ప్రదేశంలో రుద్దాలి. ఆ తర్వాత సబ్బు రుద్ది బ్రష్ కొట్టి.. ఎండలో ఆరబెడితే ఎలాంటి మరకలు అయినా పోతాయి.

వెనిగర్:

వెనిగర్ సహాయంతో కూడా ఎలాంటి మొండి మరకలను అయినా సులువగా తొలగించవచ్చు. వెనిగర్‌లో కూడా బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మరకలు ఉన్న చోట చిన్న అరకప్పుతో వెనిగర్ వేసి రుద్ది కాసేపు పక్కన పెట్టండి. ఆ తర్వాత సబ్బుతో బాగా రుద్ది.. ఎండలో ఆరవేస్తే మరకలు పోతాయి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ పౌడర్:

కిచెన్‌గా బేకింగ్ పౌడర్ చక్కగా ఉపయోగ పడుతుంది. అలాగే బట్టలపై అంటిన మరకలు కూడా బేకింగ్ పౌడర్‌తో వదిలించవచ్చు. మరకలు ఎక్కడ అంటాయో అక్కడ బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు వేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత కాసేపు పక్కన పెట్టాలి. నెక్ట్స్ సబ్బుతో రుద్ది క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల పిల్లల యూనిఫాం తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అలాగే పిల్లల బట్టలను ఎప్పుడూ సపరేటుగా ఉతకాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే