Anti Ageing: ఎప్పటికీ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. మీ లుక్ ఇక ఎవర్ గ్రీన్..
కొన్ని లైఫ్ స్టైల్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎప్పటికీ మీరు యవ్వనంగా కనిపించే విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని మీకు తెలుసా? నిజమేనండి ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ విషయాలంటే ఏంటో చూద్దాం..
చాలా మంది వయసు తక్కువగానే ఉంటుంది. కానీ వారు ఎక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా అమ్మాయిలకు పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టేసరికి వారిలో పెద్ద తరహా స్వరూపం వచ్చేస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఛాయలు కనపడకుండా జాగ్రత్త పడతారు. మరికొంతమంది ఎంత వయసున్నా అసలు అది బయటకు కనపడనివ్వరు. అలాంటి వారిని చూసినప్పుడు వారు ఎటువంటి హెల్త్ టిప్స్ ఫాలో అవుతారు? ఏం తింటారు? ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎలాంటి కాస్మోటిక్స్ వాడతారు? అనే సందేహాలు సహజంగానే కలుగుతుంటాయి. అయితే కొన్ని లైఫ్ స్టైల్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఎప్పటికీ మీరు యవ్వనంగా కనిపించే విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని మీకు తెలుసా? నిజమేనండి ఇదే విషయాన్ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆ విషయాలంటే ఏంటో చూద్దాం..
వయసు పెరిగే కొద్దీ మానవ చర్మంలోని సెల్స్ కృశించిపోతాయి. ఒక్కో సెల్ నుంచి ఇంకో సెల్ నుంచి కమ్యూనికేట్ చేయలేకపోతాయి. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది. అయితే వాటికి మరింత శక్తినిచ్చి అవి తిరిగి పనిచేసేలా చేస్తే చర్మం పునరుజ్జీవం పొందుతుంది. అందుకోసం మీరు చేయాల్సిదేంటి అంటే మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవాలి. రోజంతా యక్టివ్ గా ఉండాలి. వ్యాయామం చేయాలి. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్(నిశ్చల జీవన శైలి) ఇది మిమ్మల్ని మరింత వయసైపోయిన వారిలా మార్చేస్తుంది. అలాగే హార్ట్ అటాక్స్, డయాబెటిస్, క్యాన్సర్, డెమెన్షియా వంటి వ్యాధులకు కారణమవుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మీరు మరింత యవ్వనంగా కనిపించవచ్చు.
ఈ పనులను అలవాట్లుగా మార్చేసుకుంటే మీకు మంచి ఆరోగ్యంతో పాటు నవ యవ్వనంగా కనిపించే లుక్ మీ సొంతం అవుతుంది. అవేంటో చూద్దాం..
ప్రతి రోజూ వ్యాయామం.. మీకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే ప్రతి రోజూ క్రమ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మీ ఫిట్ నెస్ స్థాయిని పెంచడంతో పాటు హృదయ ఆరోగ్యాన్ని కూడా పదిలపరుస్తుంది.
సమతుల్య, పోషకాహారం.. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర స్నాక్స్‌లను వీలైనంత వరకూ తగ్గించండి.
నాణ్యమైన నిద్ర.. ప్రతి రాత్రి 7-9 గంటలు నిరంతరాయంగా నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. అనుకూలమైన నిద్ర వాతావరణాన్ని సృష్టించండి. ఒకే సమయంలో నిద్ర పోయేలా ప్రణాళిక చేసుకోండి.
ఒత్తిడి నిర్వహణ.. ధ్యానం లేదా అభిరుచులలో పాల్గొనడం వంటి ప్రభావవంతమైన ఒత్తిడి నిర్వహణ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వండి. మీరు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే కార్యకలాపాలను పాటించండి.
సామాజిక సంబంధాలు.. కుటుంబం,స్నేహితులతో బలమైన సామాజిక సంబంధాన్ని కొనసాగించండి. మానసికంగా ఉత్తేజపరిచే కార్యకలాపాలు, అభిరుచులలో పాల్గొనండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..