AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం.. ఈ మొక్క ఇంట్లో పెంచితే పైసలు మస్తుగా వస్తాయి..!

ఇంట్లో శాంతి, సంపద ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాంటి మొక్కల్లో మందార ఒకటి. ఇది అందమైన పూల మొక్క మాత్రమే కాదు.. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ మొక్కను సరైన దిశలో నాటి బాగా చూసుకుంటే ఇంట్లో ధనం పెరుగుతుందని నమ్మకం.

ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం.. ఈ మొక్క ఇంట్లో పెంచితే పైసలు మస్తుగా వస్తాయి..!
Hibiscus
Prashanthi V
|

Updated on: Jun 12, 2025 | 9:06 PM

Share

వాస్తు నిపుణులు చెప్పినట్లు మందార పువ్వుకు దైవశక్తిని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఈ మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఉండే దోషాలు పోతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో పెంచితే మంచిదని చెబుతారు. ఈ రెండు దిశలు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని వాస్తులో భావిస్తారు.

మందార పూలు సాధారణంగా పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా పల్లెటూరి ఇళ్లలో ఇవి నెమ్మదిగా పెరుగుతూ.. ఇంటిని శుభంగా ఉంచే మంచి చిహ్నంగా ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే మొక్క ఎండిపోకుండా తరచుగా నీరు పోస్తూ జాగ్రత్తగా పెంచాలి.

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు.. అప్పుల్లో కూరుకుపోయిన వారు ఈ మందార మొక్కను ఇంట్లో పెంచితే దోషాలు తగ్గుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంట్లో డబ్బు నిల్వ చేసే చోట మందార పూలను ఉంచి.. గణపతిని దుర్గాదేవిని ధ్యానిస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. ఈ పనిని 7 రోజులపాటు రోజూ చేస్తే డబ్బు సమస్యలు దూరమవుతాయట.

కుటుంబ సంబంధాల్లో గొడవలు, తారసాలు జరుగుతున్నప్పుడు బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మందార పువ్వుతో ఒక పరిష్కారం ఉంది. మీరు నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకునే దిండు కింద ఈ పువ్వును ఉంచి నిద్రపోండి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి సంబంధాలను మెరుగుపరుస్తుందని నమ్మకం.

ఇంట్లో శాంతి కోరే వారు రాత్రివేళ రాగి గిన్నెలో నీటితో కలిపి మందార పూలను ఉంచి.. సూర్యోదయం సమయంలో సూర్యుడికి పూజ చేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు. ఇది శుభాన్ని పెంచి, చెడు శక్తులను తొలగించడానికి సహాయపడుతుంది.

ఈ విధంగా వాస్తు ప్రకారం మందార మొక్క ఇంట్లో ఉండటం వల్ల ఆధ్యాత్మిక శక్తిని కలగజేయడమే కాకుండా.. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో పచ్చదనం, అందం, మంచి వాతావరణాన్ని తీసుకురావడంలో ఈ మొక్క ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.