Valentine’s Day effect: మానసిక ఆరోగ్యాన్ని చెడగొడుతున్న వాలెంటైన్స్ డే! సైకాలజిస్ట్ లు చెబుతున్న పచ్చి నిజాలు..
ఒంటరిగా కూడా ప్రేమికుల రోజును సెలెబ్రేట్ చేసుకోవచ్చట తెలుసా? అదేంటి వాలెంటైన్స్ డే అంటే జంటల వేడుక కదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం తప్పక చదవండి..

సెయింట్ వాలెంటైన్ అనే క్రైస్తవ అమరవీరుడి గౌరవార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే కి ఆదరణ పెరుగుతోంది. ఏటా ఈ రోజును నిర్వహించే వారి సంఖ్య అధికమవుతోంది. నిజానికి ఈ ప్రేమ వేడుక ఒక రోజుకు మాత్రమే పరిమితం కాదు. ఒక వారం ముందు నుంచే రోజ్ డే , ప్రపోజ్ డే , హగ్ డే నుంచి కిస్ డే వరకు వచ్చి చివరికి వాలెంటైన్స్ డే వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జంటలు, ప్రేమికులు దీనిని ఒక సంబరంలా జరుపుకుంటుంటారు. అయితే ఈ వారం రోజుల పాటు మీడియాతో పాటు జనాల్లో కొనసాగుతున్న హైప్ కారణంగా చాలామంది మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణులు చెబుతున్నారు. అది జంటలైనా.. లేక ఒంటరిగా ఉంటున్న వారిపైనా ఈ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సంబంధంలో ఉన్నవారు ఖరీదైన బహుమతులు, గొప్ప హావభావాల కోసం ఖర్చు చేయాలని ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఒంటరిగా ఉన్నవారు భాగస్వామి లేకుండా తమ జీవితం పూర్తి కాదని ఆలోచనలు చేస్తున్నారు. ఫలితంగా మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు నిపుణులు గుర్తించారు.
దంపతుల్లో ప్రభావం ఎలా అంటే..
కొంతమంది తమ సంబంధాలను రొమాంటిక్ బాలీవుడ్ కథలతో పోల్చుకుంటారు. వారికిలా ఉండాలి. వారికిలా చేయాలి.. వారికిలా మంచి బహుమతులు మన భాగస్వామికి ఇవ్వాలని ఆలోచిస్తుంటారు. ఈ చింతన పురుషుల్లో అధికంగా ఉంటుందట. పురుషులు తమ భాగస్వాముల కోసం దాదాపు ఎల్లప్పుడూ సంపన్నమైన, సొగసైన బహుమతులను కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటారట.. ఇవన్నీ పురుషులలో అసమానమైన మానసిక ఒత్తిడిని సృష్టిస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఒంటరితనం..
మీరు ఒంటరిగా ఉన్నా లేదా సంబంధంలో ఉన్నా, వాలెంటైన్స్ డే ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. చాలా మందికి, వారికి అంత ప్రత్యేకమైన వ్యక్తి ఉండకపోవచ్చు. కానీ అలాంటి వ్యక్తి నాకూ ఉంటే బాగుండు అనే ఆలోచన.. నేను ఒంటరిగా ఉన్నా అనే బాధ మనసుపై ఒత్తిడిని పెంచేలా చేస్తుంది. ప్రేమికుల రోజున మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీరు చూసే సోషల్ మీడియా పోస్ట్ లు, టీవీల్లో చూపించే దృశ్యాలోని మీలోని ఒంటరితనాన్ని ఎత్తి చూపుతుంది. ఫలితంగా మానసికొ ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అయితే ఒంటరితనం అనేది ఒక భావన మాత్రమేనని.. అది ఆరోగ్య సమస్య కాదని నిపుణులు చెబుతున్నారు. కానీ దానిపై అధిక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జీవితంలో జరిగే కొన్ని సంఘటనల కారణంగా మనిషిగా ఒంటరిగా మారే అవకాశం ఉంటుంది. దంపతులు విడాకులు తీసుకున్న సమయంలో.. ఏదా ఎవరైనా మరణించినప్పుడు ఇలాంటి అనుభవాలు వస్తాయి.
ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది..
వాలెంటైన్స్ డే మీ ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. మనల్ని మనం విలువైన వారిగానూ, మన అభిప్రాయాలు, నిర్ణయాలపై నమ్మకం ఉంచుతాం. అయితే ఈ ప్రేమికుల రోజున మీరు చూసే సోషల్ మీడియా పోస్ట్ లు, టీవీల్లో చూపించే దృశ్యాలోని మీలోని ఆత్మగౌరవాన్ని తట్టిలేపి. మీరు ఎటువంటి బంధంలోనూ లేరని చెప్పి.. ఒంటరిగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. వీటిని అలా వదిలేస్తే తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది.
సింగిల్ గా ఉన్నా ప్రేమికుల రోజు జరుపుకోవచ్చు..
ప్రేమికుల రోజున ఒంటరిగా ఉన్నా భావన మీలో నుంచి తొలగించుకోవాలి. వాలెంటైన్స్ డే అంటే ప్రేమను వ్యక్తీకరించడానికి ఉపయోగ పడే ఓ సాధనం అంతే. ఆ ప్రేమను ప్రేయసిపైనో లేక ప్రియుడిపైన మాత్రమే చూపించాలని మీ లేదు. మీకు నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ ఆనందం పొందవచ్చు. ఎవరికైనా సాయం చేయడం ద్వారా మంచి అనుభూతిని మిగుల్చుకోవచ్చు. వృద్ధులు, అనాథలపై మీ ప్రేమను చూపిస్తూ వారికి మీ చేతనైనా సాయం చేయొచ్చు. ఇలా చేస్తే ఒంటరిగా ఉన్నా మీ ఎలాంటి ప్రభావం పడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..



