Lifestyle: స్మార్ట్‌ఫోన్‌తో చిన్నారులపై మెదడుపై ప్రభావం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
మొబైల్ ఫోన్లను అతిగా వాడటం వల్ల పిల్లల మెదడు, వినికిడి,మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలి కాంతి పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది, వారి ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల పిల్లల వినికిడి...

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల దుష్ప్రభావాలకు కారణం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులపై స్మార్ట్‌ఫోన్ తీవ్ర ప్రతికూల ప్రభావంచూపుతుందని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మొబైల్ ఫోన్లను అతిగా వాడటం వల్ల పిల్లల మెదడు, వినికిడి,మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలి కాంతి పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది, వారి ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల పిల్లల వినికిడి సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధనల్లో తేలింది.
అంతేకాకుండా మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే పెద్ద శబ్దం పిల్లల చెవుల సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా, వారు వినికిడిలో ఇబ్బంది పడవచ్చు. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగం చిన్నారుల్లో సామాజిక, భావోద్వేగ సమస్యలకు దారి తీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడడానికి తక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వీరిలో ఒంటరితం, నిరాశ పెరుగుతుంది.
ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 99% మంది మొబైల్ ఫోన్‌లు, గాడ్జెట్‌లకు బానిసలుగా మారుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబతోంది. అయితే దేశంలో సుమారు 66% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు అధిక స్క్రీన్ సమయం ప్రమాదకరమని తెలియదు. ఇటీవలి అధ్యయనం ప్రకారం, 65% కుటుంబాలు తమ పిల్లలు అన్నం తినడానికి టీవీలు చూపిస్తున్నారని తేలింది. 12 నెలల వయస్సు ఉన్న పిల్లవాడు కూడా రోజుకు 53 నిమిషాలు స్మార్ట్ ఫోన్‌లు చూస్తున్నారు. ఇక 3 సంవత్సరాల వయస్సులో, స్క్రీన్ సమయం గంటన్నరకు పెరుగుతుంది.
పిలల్లను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఇవ్వడకూడదని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలి. స్మార్ట్ ఫోన్‌లకు బదులుగా వారికి ఇతర వ్యాపాకాలను అలవాటు చేయాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
