Tulsi Leaves: వామ్మో.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితే ఇన్ని ప్రయోజనాలా!
Tulsi Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా చేసినట్లయితే 8 వ్యాధులు పరార్ కావడం ఖాయమంటున్నారను. ఉదయాన్నే ఖాలీ కడుపుతో తులసి ఆకులను నమిలినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పరగడుపున తులసి ఆకులను నమలడం వల్ల అధిక కొలెస్ట్రాల్..
Updated on: Mar 23, 2024 | 7:38 AM

Tulsi Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమిలితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇలా చేసినట్లయితే 8 వ్యాధులు పరార్ కావడం ఖాయమంటున్నారను. ఉదయాన్నే ఖాలీ కడుపుతో తులసి ఆకులను నమిలినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

శరీరంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పరగడుపున తులసి ఆకులను నమలడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది గువండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ప్రమాదం ఉంటుంది.

అలాగే ఈ రోజుల్లో మధుమేహంతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. మధుమేహం ఉన్నవారికి కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు ఉదయాన్నే తులసి ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.ఇది డయాబెటిస్ వారికి ఎంతో మేలు చేస్తుంది.

నోటి దుర్వాసన: ఇక నోటి దుర్వాసనతో బాధపడేవారు తులసి ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తినడం వల్ల రోగ నిరోధశక్తి పెరుగుతుంది. దీంతో మీరు అనేక తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా నివారించవచ్చు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. తులసి ఆకులను నమలడం వల్ల మూత్రపిండాల పనితీరు సైతం మెరుగు పడుతుంది. కిడ్నీ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. ఇది మొటిమలు, మొటిమల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.




