Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

|

Dec 10, 2022 | 4:05 PM

ప్రస్తుత ప్రపంచంలో మానవుడు అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పడు ఎం తినాలన్నా సమస్యాత్మకంగానే.. మానవ ఆరోగ్య..

Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
Cholesterol
Follow us on

ప్రస్తుత ప్రపంచంలో మానవుడు అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పడు ఎం తినాలన్నా సమస్యాత్మకంగానే మారింది మానవ ఆరోగ్య పరిస్థితి. బీపీ, షుగర్, అల్సర్, డయాబెటీస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలతో మానవుడు సతమతమవుతున్నాడు. అలాంటి సమస్యలలో అత్యధికులు ఎదుర్కొనే సమస్య కొలెస్ట్రాల్ కూడా ఒకటి. ఆహారపు అలవాట్ల కారణంగా కలిగే అతిపెద్ద సమస్య ఇది. అందుకే కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొనేవారు తగిన ఆహారాన్ని తీసుకుని నిత్యం తమ గుండెను కాపాడుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే శరీరంలో మనం ఎదుర్కొనే చాలా సమస్యల్ని తేలికగా అధిగమించగలం. పోషకాలతో నిండిన, తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది బాహ్య, అంతర్గత శరీర పనితీరుని ఎంతో మెరుగుపరుస్తుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ ప్రభావం మానవ శరీరం మీద రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకరకంగా ఆరోగ్యానికి మంచి చేస్తే మరొక విధంగా చెడు చేసి అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది.

మయో క్లినిక్ ప్రకారం కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే ఒక పదార్థం. ఇది ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి శరీరానికి ఉపయోగపడుతుంది. అధిక స్థాయి కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల గుండెకు ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. చివరికి అది గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్‌కు కారణం అవుతుంది. శరీరంలోని చాలా కొలెస్ట్రాల్ కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. మిగతాది మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యను మన ఆహారపు అలవాట్ల ద్వారా తగ్గించుకోవచ్చు. అది ఎలా అంటే..

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు తీసుకోవలసిన పానీయాలు(డ్రింక్స్)..

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మీరు డైట్‌లో భాగంగా తీసుకోవడం వలన హై కొలెస్ట్రాల్
లెవెల్స్ తగ్గుతాయి. అలానే బ్లాక్ టీని కూడా మీరు తీసుకోవచ్చు. ఇది కూడా హై కొలెస్ట్రాల్
లెవెల్స్‌ను తగ్గిస్తుంది.

కోకో డ్రింక్స్: 450 మిల్లీగ్రాముల కోకో కలిగిన డ్రింక్స్‌ను మీరు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

బెర్రీ స్మూతీస్: బెర్రీస్‌లో చక్కటి గుణాలు ఉంటాయి. బెర్రీస్ కలిగిన స్మూతీస్‌ని మీరు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.

సోయ్ మిల్క్: సోయ్ మిల్క్ ద్వారా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. హై కొలెస్ట్రాల్
లెవెల్స్‌తో బాధపడే వాళ్ళు తప్పక చేర్చుకోండి.

టమాట జ్యూస్: ఇది కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. కాబట్టి దీనిని డైట్‌లో చేర్చుకుని ప్రయోజనాలని పొందండి. దానితో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.