AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతికి పెన్నిధి పులులు.. ఒకసారి తింటే 30 గంటలు నిద్రపోయే ఈ జీవుల గురించి మీకు తెలుసా..

అడవిలో ఉండే క్రూర జంతువులలో పులి ఒకటి. మన దేశానికి మాత్రమే కాదు బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు జాతీయ జంతువు పులి. ఈ అందమైన సాటిలేని బలం కలిగిన ఈ పులి అనేక జెండాలు, కోట్లు, ఆయుధాల పైనా, క్రీడా జట్లకు చిహ్నాలుగానూ కనిపిస్తుంది. ప్రకృతి పెన్నిధి పులి జనాభా తగ్గడం ఆందోళన కలిగిస్తుండడంతో పులుల సంరక్షణ కోసం అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. అయితే పులలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. అవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.

ప్రకృతికి పెన్నిధి పులులు.. ఒకసారి తింటే 30 గంటలు నిద్రపోయే ఈ జీవుల గురించి మీకు తెలుసా..
Unknown Facts About Tiger
Surya Kala
|

Updated on: Aug 01, 2025 | 1:55 PM

Share

పులులు భూమిపై అత్యంత అందమైన, శక్తివంతమైన జీవులలో ఒకటి. అయితే వీటి ఉనికి ప్రమాదంలో ఉంది. పులులు గుంపులుగా జీవించడానికి ఇష్టపడవు. ఒంటరిగా జీవిస్తాయి. ఈ కారణంగా పులుల స్వభావం, మర్మమైనదిగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రకృతి పెన్నిధిగా భావించే పులుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గుతుంది. దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వాలు, ప్రకృతి ప్రేమికులు పులుల గురించి అవగాహన పెంచే కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారు. పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే పులుల గురించి ఇప్పటి వరకూ తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

పులి చారలు ప్రత్యేకమైనవి పులి చారలు మనిషి వేలిముద్రల మాదిరిగానే భిన్నంగా ఉంటాయి. అవును పులి శరీరంపై ఉండే చారలు అన్నిటికి ఒకేలా ఉంటాయని భావిస్తున్నార.. అయితే అది తప్పు. మనిషి వెలి ముద్రలు ఎలా ఒకలా ఉండవో.. పులుల శరీరంపై ఉండే చారలు ఒక పులికి మరొక పులికి పోలి ఉండవు. భిన్నమైన చారలు కలిగి ఉంటాయి. వీటి సహాయంతో పులులను గుర్తిస్తారు. ఈ చారలు వాటి గుర్తింపు మాత్రమే కాదు.. అడవిలో దాక్కోవడానికి కూడా సహాయపడతాయి.

ప్రపంచంలోని పులులలో సగానికి పైగా భారతదేశంలోనే.. ప్రపంచంలోనే అత్యధికంగా పులులు భారతదేశంలోనే ఉన్నాయి. జాతీయ పులుల సంరక్షణ సంస్థ ప్రకారం.. భారతదేశంలో 2022 నాటికి 3,682 పులులు ఉన్నట్లు అంచనా

ఇవి కూడా చదవండి

తమ చెవులతో సంభాషించుకునే పులులు పులులకు చాలా సున్నితమైన చెవులు ఉంటాయి. అవి శబ్దాలను వినడమే కాదు చెవుల ద్వారా సంభాషించగలవు. పులులు తమ పిల్లలతో సంభాషించడానికి తమ చెవుల వెనుక ఉన్న తెల్లని మచ్చలను ఉపయోగిస్తాయి. అవి తమ చెవుల ద్వారా కూడా ప్రమాదాన్ని సూచిస్తాయి. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినట్లయితే.. వెంటనే పులి తన చెవులను చదును చేసి పిల్లలకు సంజ్ఞ చేస్తుంది.

వారానికి ఒక్క పూట భోజనం.. పులులు ఒకేసారి 18-20 కిలోల మాంసం తినగలవు. వీటికి కడుపు నిండే విధంగా భారీ ఆహారం దొరికితే.. అవి మళ్ళీ ఒక వారం పాటు వేటాడవు. ఇది వాటి శరీరం సహజ అనుకూలతలో భాగం. పులి కడుపు నిండా తింటే.. దాదాపు 30 గంటల పాటు ఏకదాటిగా నిద్రపోతుంది.

వివిధ రకాల శబ్దాలు చేస్తుంది పులులు గర్జించడమే కాదు.. వివిధ రకాల శబ్దాలు చేస్తాయి. అవి గుర్రుమంటాయి, బుసలు కొడతాయి. మియావ్ అని కూడా అంటాయి. అవి ఈ శబ్దాలను కమ్యూనికేషన్, సంభోగం, తాము ఉండే భూభాగాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తాయి.

పులి ఒక అంతరించిపోతున్న జాతి గత 100 సంవత్సరాలలో పులుల జనాభా 97% తగ్గింది. అక్రమ వేట, అటవీ నిర్మూలన, మానవ-జంతు సంఘర్షణ పులులు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు.

ప్రతి వారం స్మగ్లర్ల నుంచి రెండు పులులు స్వాధీనం సగటున ప్రతి వారం రెండు పులులను స్మగ్లర్ల నుంచి రక్షిస్తున్నారు. పులుల శరీర భాగాల అక్రమ రవాణా ఆసియాలో ఒక పెద్ద బ్లాక్ మార్కెట్. అనేక దేశాలల్లో పులుల శరీర భాగాలను సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగిస్తారు.

2 మిలియన్ సంవత్సరాలపైగా జీవిస్తున్న పులులు పులులు భూమిపై దాదాపు 2 మిలియన్ సంవత్సరాలుగా నివసిస్తున్నాయి. ఈ జాతి చాలా పురాతనమైనది. ఇది అనేక వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడింది. అయితే ఇప్పుడు మానవ కార్యకలాపాల కారణంగా పులుల జాతి ప్రమాదంలో ఉంది. మానవుల కారణంగా వీటి జనాభా దాదాపు 97% తగ్గింది.

అడవిలో కంటే బందిఖానాలో ఎక్కువ పులులు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం జంతుప్రదర్శనశాలలలో, ప్రైవేట్ యజమానుల వద్ద బందిఖానాలో ఉన్న పులులు అడవిలో నివసించే పులుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోనే దాదాపు 5,000 పులులను బందిఖానాలో ఉంచి పెంచుతున్నారు. అయితే అడవిలో నివసించే పులుల సంఖ్య కేవలం 3,900 మాత్రమే. అయితే పులులు అమెరికాకు చెందినవి కావు.

మరిన్ని హ్యూమన్ ఇంటరెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..