AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Red Ant Chutney: గిరిజనుల స్పెషల్ ఎర్ర చీమల చట్నీ.. ఒకసారి ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..

శాఖాహారులు , మాంసాహారులు రకరకాల ఆహార పదార్ధాలను రుచి చూస్తూనే ఉంటారు. భారతీయ సంప్రదాయ పంటలతో పాటు.. చైనీస్, ఇటాలియన్ వంటి విదేశీ వంటలను కూడా రుచి చూస్తున్నారు. అయితే మన దేశంలోని గిరిజనుల ఆహారాల గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఎర్ర చీమల నుంచి వెదురు బొంగులతో చేసే రకరకాల అద్భుతమైన గిరిజన వంటలున్నాయి. ఈ రోజు గిరిజనుల స్పెషల్ వంటకం ముఖ్యంగా ఒడిశా , ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసుల స్పెషల్ ఎర్ర చీమల చట్నీ తయారీ విధానం తెలుసుకుందాం..

Red Ant Chutney: గిరిజనుల స్పెషల్ ఎర్ర చీమల చట్నీ.. ఒకసారి ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..
Red Ant Chutney
Surya Kala
|

Updated on: Aug 01, 2025 | 12:16 PM

Share

గిరిజన వంటకాలు కేవలం వంటకాలు మాత్రమే కాదు. అవి నేటి మనిషి మనుగడకు మార్గాలు.. ప్లాస్టిక్ ఉండదు, ప్రిజర్వేటివ్‌లు ఉండవు, వ్యర్థాలుఉండవు. వండడానికి కుండలు, లేదా వెదురు వంటి ప్రకృతి సహజ సిద్దమైన పాత్రలనే ఉపయోగిస్తారు. ఈ వంట చేసే పద్ధతులు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనవి. అటువంటి గిరిజన వంటల్లో ఒకటి ఎర్ర చీమల చట్నీ దీనిని గిరిజనలు చప్రా అని అంటారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాతో పాటు ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన బోండా,యు దిడాయి వంటి తెగలు తయరు చేసే ప్రత్యేకమైన వంటకం ఎర్ర చీమల చట్నీ. ఇది ఆరోగ్యానికి మంచిదని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. ఈ ఎర్ర చీమల చట్నీ ప్రోటీన్, ఖనిజాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. GI ట్యాగ్ కూడా లభించిన ఈ ఎర్ర చీమల చట్నీ తయారీ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

  1. ఎర్ర చీమలు
  2. ఎర్ర చీమల గుడ్లు
  3. ఎండు మిరపకాయలు
  4. అల్లం
  5. వెల్లుల్లి
  6. చింతపండు
  7. ఉప్పు –
  8. కొబ్బరి
  9. పుదీనా

తయారీ విధానం: ఎర్ర చీమలను, వాటి గుడ్లను సేకరించి శుభ్రం చేయాలి. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి చీమలను వేసి వేయిస్తారు. తర్వాత రోటిలో వేయించిన చీమలు, గుడ్లు వేసి రోకలితో మెత్తగా దంచుకోవాలి. తర్వాత మిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉప్పు, చింతపండు, కొబ్బరి, పుదీనా వేసి తగినంత నీరు పోసి రుబ్బుకోవాలి. అంతే ఎర్ర చీమల చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటారు. చీమలలో ఉండే ఫార్మిక్ ఆమ్లం చట్నీకి మంచి రుచి ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్