- Telugu News Photo Gallery Eating raw banana helps to control sugar levels bad cholesterol and more details
Raw Banana: పచ్చి అరటికాయ తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Raw Banana Benefits: పచ్చి అరటికాయ..దాదాపు అందరికీ తెలిసిందే.. కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్లినప్పుడు తప్పనిసరిగా అరటికాయను చూసే ఉంటారు.. ఎందుకంటే.. పచ్చి అరటికాయను కూరగా, ఫ్రైగా చేసుకుని తింటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఆకుపచ్చ రంగులో ఉండే అరటికాయను తినటం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...
Updated on: Aug 01, 2025 | 1:51 PM

పచ్చి అరటికాయలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పచ్చి అరటికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాదు..పచ్చి అరటికాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

పచ్చి అరటికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా పచ్చి అరటికాయ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పచ్చి అరటికాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.

పచ్చి అరటికాయను వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. పచ్చి అరటిపండ్లలో ఉండే విటమిన్ సి చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మంపై ముడతలు, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచటంలో కూడా పచ్చి అరటి కాయ తోడ్పడుతుంది.

ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం పచ్చి అరటికాయ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అరటికాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవారికి హానికరంగా ఉంటుంది. అలాగే, అలర్జీలు ఉన్నవారు కూడా. కొంతమందికి అరటికాయకు అలెర్జీ ఉండవచ్చు. అలాంటి వారు పచ్చి అరటికాయను తినకూడదు.




