Type 1.5 Diabetes: టైప్ 1.5 డయాబెటీస్.. ఇది మహా డేంజర్ గురూ..

ప్రస్తుత కాలంలో డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచం వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. షుగర్ వ్యాధి రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే.. తగ్గడం చాలా కష్టం. షుగర్ వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోలేం. ఖచ్చితంగా ఆహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డయాబెటీస్‌లో టైప్ 1, టైప్ 2..

Type 1.5 Diabetes: టైప్ 1.5 డయాబెటీస్.. ఇది మహా డేంజర్ గురూ..
Diabetes
Follow us

|

Updated on: Aug 29, 2024 | 2:10 PM

ప్రస్తుత కాలంలో డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారు. కేవలం మన దేశంలోనే కాదు.. ప్రపంచం వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. షుగర్ వ్యాధి రావడం అనేది చాలా కామన్ అయిపోయింది. డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే.. తగ్గడం చాలా కష్టం. షుగర్ వచ్చిన తర్వాత ఎలాంటి ఆహారాన్ని కూడా తీసుకోలేం. ఖచ్చితంగా ఆహార పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డయాబెటీస్‌లో టైప్ 1, టైప్ 2 ఉన్నాయి. వీటితోనే జనాలు ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు డయాబెటీస్‌లో మరో కొత్త రకం వచ్చింది. అదే టైప్ 1.5 డయాబెటీస్. డయాబెటీస్‌ పేరుతో కొత్త రూపం దాల్చిందన్న సంగతి తెలిసిందే.

మిగతా వాటితో పోల్చితే డయాబెటీస్ టైప్ 1.5 అనేది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం చాలా కష్టమని వైద్యులు అంటున్నారు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ గురించి తెలిసిందే. ఇప్పుడు టైప్ 1.5 డయాబెటీస్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏంటో చూద్దాం.

టైప్ 1.5 డయాబెటీస్ లక్షణాలు:

టైప్ 1.5 డయాబెటీస్ లక్షణాలు పరిశీలిస్తే.. దాహం అనేది అతిగా ఉంటుంది. మీరు ఎంత మంచి నీళ్లు తాగినా ఇంకా దాహం వేస్తుంది. మూత్రం కూడా అధికంగా వస్తుంది. నీరసంగా ఉండటం, మసకగా, నిద్ర ఎక్కువగా రావడం, బరువు ఒక్కసారిగా తగ్గడం వంటివి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎందుకు వస్తుంది?

టైప్ 1.5 డయాబెటీస్ అనేది రావడానికి ముఖ్య కారణం సరైన లైఫ్ స్టైల్ మెయిన్‌టైన్ చేయడక పోవడమే. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకుండా ఒత్తిడిని అధికంగా తీసుకోవడం వల్ల టైప్ 1.5 డయాబెటీస్ వస్తుంది. దీన్ని త్వరగా కనిపెట్టడం కష్టం.

ఎలా ఎటాక్ చేస్తుంది?

టైప్ 1.5 డయాబెటీస్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేసి బలహీన పరుస్తుంది. ఆ తర్వాత ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై కూడా దాడి చేసి.. సమస్యను పెంచుతుంది. ఈ డయాబెటీస్ సోకిన వ్యక్తులకు ఇన్సులిన్ అవసరం ఉండదు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..