- Telugu News Lifestyle Travel Visa less entry for Indians in those countries, Happy for those going on tours, Visa Free Countries details in telugu
Visa Free Countries: ఆ దేశాల్లో భారతీయులకు వీసా లెస్ ఎంట్రీ.. టూర్స్‌కు వెళ్లే వారికి పండగే..!
మనలో చాలా మందికి విదేశాల్లో విహార యాత్రకు వెళ్లానే ఆశ ఉంటుంది. అయితే వీసా ప్రాసెస్ వంటి ఇబ్బందులకు భయపడి చాలా మంది దేశీయంగానే కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. కానీ కొత్తగా పెళ్లయిన జంటలు మాత్రం విదేశాల్లో విహారయాత్రలు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీసా ప్రాసెస్ లేకుండానే కొన్ని దేశాలకు వెళ్లవచ్చనే సంగతి చాలా మందికి తెలియదు. అవును మీరు వింటున్నది నిజమే కొన్ని దేశాలు భారతీయులను ఎలాంటి వీసా లేకుండా తమ దేశాలకు ఆహ్వానిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం వీసా లేకుండా ఏయే దేశాల్లో విహార యాత్రలకు వెళ్లవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.
Updated on: Jul 28, 2024 | 7:28 PM

మైనింగ్, వ్యవసాయం తర్వాత జింబాబ్వే దేశంలో పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ దేశంలో కొన్ని దేశాలకు వీసా లెస్ ఎంట్రీ ఇచ్చింది. జింబాబ్వేలో హ్వాంగే నేషనల్ పార్క్, మనా పూల్స్, గోనరెజౌ నేషనల్ పార్క్, విక్టోరియా ఫాల్స్, లేక్ కరీబా, గ్రేట్ జింబాబ్వే నేషనల్ మాన్యుమెంట్ వంటి అనేక జాతీయ పార్కులు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ దేశానికి భారతీయులు ఎలాంటి వీసా లేకుండా వెళ్లవచ్చు.

మాల్దీవులకు భారతీయులు ఎలాంటి వీసా లేకుండా వెళ్లవచ్చు. ఇక్కడి పర్యాటక రంగంలో దాదాపు 25000 మంది ఆధారపడి ఉన్నారంటే ఈ దేశం పర్యాటక రంగానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో? అర్థం చేసుకోవచ్చు. మాల్దీదువుల్లోని ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. హనీమూన్ వెళ్లేవారికి మాల్దీవులు మంచి పర్యాటక ప్రదేశంగా నిపుణులు చెబుతున్నారు.

భారతదేశానికి అత్యంత దగ్గరగా ఉన్న శ్రీలంకకు వెళ్లడానికి కూడా ఎలాంటి వీసా అవసరం లేదు. శ్రీలంక దేశంలో పర్యాటక రంగంపై ఆధారపడింది. 2018లో శ్రీలంకలో 2.5 మిలియన్ల పర్యటించారంటే శ్రీలంక డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. కొలంబో, గ్రేటర్ కొలంబో, సౌత్ కోస్ట్ రిసార్ట్, ఈస్ట్ కోస్ట్ రిసార్ట్ ప్రాంతం వెస్ట్ కోస్ట్ రిసార్ట్, హై కంట్రీ రిసార్ట్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా శ్రీలంక నగరాలైన అనురాధపుర, దంబుల్లా, కాండీ, పొలోన్నరువా వంటి ప్రాంతాలు ఎంతగానో ఆకర్షిస్తాయి.

థాయ్‌లాండ్ దేశానికి కూడా భారతీయులు వెళ్లడానికి ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదు. ముఖ్యంగా ఆ దేశ రాజధాని అయిన బ్యాంకాక్ నగరం యువ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా బ్యాచిలర్ పార్టీల కోసం వెళ్లే వారికి మొదటి ఎంపికగా బ్యాంకాక్ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాలనుకునే థాయ్‌లాండ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

జపాన్ రాజధాని అయిన టోక్యో కూడా పర్యాటకులను ఇటీవల కాలంలో ఎక్కువగా ఆకర్షిస్తుంది. టోక్యోకు కూడా భారతీయులు ఎలాంటి వీసా లేకుండా వెళ్లవచ్చు. టోక్యోలోని చియోడా, నేషనల్ డైట్ బిల్డింగ్, ఇంపీరియల్ ప్యాలెస్‌లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.




