AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు

పవిత్ర పుణ్యక్షేత్రాల సందర్శన ఇక మరింత సులభం కానున్నాయి. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) భక్తుల కోసం సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఒకే రోజులో నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఇస్తోంది. అది కూడా కేవలం రూ. 700 నుంచి ప్రారంభమయ్యే టికెట్ ధరలతో ఈ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా, సురక్షితంగా, సౌకర్యవంతంగా తీర్థయాత్రలు చేయడానికి భక్తులకు ఇదొక గొప్ప అవకాశం.

TSRTC Tour: ఆర్టీసీ తీర్థయాత్ర.. రూ. 700 నుంచే బంపర్ ఆఫర్.. ఒకే రోజులో 4 పుణ్యక్షేత్రాలు
Tsrtc Temple Tour
Bhavani
|

Updated on: Jul 03, 2025 | 7:52 PM

Share

తక్కువ ఖర్చుతో యాత్రికులు పుణ్యక్షేత్రాలు సందర్శించేలా బోధన్ ఆర్టీసీ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ వాహనాలతో పోల్చితే తక్కువ ఛార్జీతో, భక్తులు సురక్షితంగా పుణ్యక్షేత్రాలు సందర్శించేలా చర్యలు తీసుకున్నారు. గత నెల 27న వేములవాడ, కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలకు తొలిసారి బస్సు సర్వీసు ప్రారంభించారు. దీనికి భక్తుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో మరిన్ని ప్రాంతాలకు బస్సులు నడిపేలా ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. ఈ నెలలో మూడు రూట్లలో లగ్జరీ, డీలక్స్ బస్సులు నడపనుంది.

మూడు ప్రత్యేక రూట్లలో ప్యాకేజీలు

పండుగల సమయాల్లో, సెలవు దినాల్లో ప్రజలు పుణ్యక్షేత్రాల సందర్శనకు అధిక ఆసక్తి చూపుతున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణను గమనించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన మూడు రూట్లు ఇలా ఉన్నాయి:

రూ. 1700 ప్యాకేజీ: ఈ నెల 5న శోలాపూర్, గంగాపూర్, పండరీపూర్, తుల్జాపూర్, బీదర్‌కు డీలక్స్ బస్సు బయల్దేరుతుంది. ఈ టూర్ ప్యాకేజీకి ఒక్కొక్కరు రూ. 1700 చెల్లించాలి.

రూ. 700 ప్యాకేజీ: జులై 5, 12, 19, 26 తేదీల్లో అపురూప వేంకటేశ్వరస్వామి, కొండగట్టు, వేములవాడ, ధర్మపురి పుణ్యక్షేత్రాలకు డీలక్స్ బస్సులు నడపనున్నారు. దీనికి ఒక్కొక్కరికి రూ. 700 ధర నిర్ణయించారు.

రూ. 5100 ప్యాకేజీ: జులై 8న కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ క్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నారు. దీనికి రూ. 5100 చెల్లించాలి.

ఆర్టీసీ ఆదాయ వృద్ధికి, భక్తుల సౌకర్యానికి

ప్రజలు విహారయాత్రలకు ఎక్కువగా ప్రైవేటు వాహనాలపై ఆసక్తి చూపుతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఆదాయం పెంచుకునేందుకు అధికారులు విహార యాత్రలకు బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బోధన్ డిపో నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు బస్సు సర్వీసులు ఉండగా, తాజాగా పుణ్యక్షేత్రాలకు బస్సులు నడుపుతున్నారు.

ఆర్టీసీ డీఎం విశ్వనాథ్ మాట్లాడుతూ, “ఆర్టీసీ నడిపే పుణ్యక్షేత్రాల బస్సు సర్వీసులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఖర్చుతో ఒకే రోజులో సుమారు నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వీలుంది. యాత్రికుల ఆదరణను బట్టి, శ్రీశైలం వంటి ఇతర ప్రాంతాలకు కూడా బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.