Araku Valley: మంచుదుప్పటి కప్పుకున్న ఆంధ్రా ఊటీ.. దసరా సెలవులతో సందర్శకులతో కిటకిటలాడుతున్న అరకులోయ
రెండు తెలుగు రాష్ట్రాల్లో భూతల స్వర్గంగా భావించే ఆంధ్ర ఊటి అరకులోయ.. ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. మేఘాలకు తోడు చినుకులు పలకరిస్తుండడం.. గిరులపై పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం..
Araku Valley: ఆంధ్రా ఊటి అరకులోయలో మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. అరకు తో పాటు అల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు దట్టంగా పొగ మంచు కమ్ముకుని పులకిస్తున్నాయి. వంజంగి మేఘాలకొండ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. పర్యాటకులను తమ వైపు రారామ్మని పిలుస్తున్నాయి. అసలే దసరా సెలవులు.. ఆపై ప్రకృతి అందాలతో భూతల స్వర్గాన్ని తలపించే అల్లూరు జిల్లా పర్యాటక ప్రాంతాలను చూసేందుకు టూరిస్టులు క్యూ కడుతున్నారు. సెల్ఫీల్లో ప్రకృతి సహజ అందాలను బంధిస్తూ.. నేచర్ ను ఎంజాయ్ చేస్తూ వీకెండ్ ను గడుపుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భూతల స్వర్గంగా భావించే ఆంధ్ర ఊటి అరకులోయ.. ఇప్పుడు సందర్శకులతో కిటకిటలాడుతోంది. మేఘాలకు తోడు చినుకులు పలకరిస్తుండడం.. గిరులపై పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం.. ఎత్తయిన కొండల మధ్యాహ్నం నుంచి జాలవారే జలపాతాలు మరింత సోయగాన్ని పంచుకుంటున్నాయి. కూల్ క్లైమేట్ లో మన్యంలోని పర్యాటక ప్రదేశాలు మరింత సుందరంగా మారాయి. కొండలు, ఘాట్ రోడ్ పై పొగమంచు తో ప్రకృతి అందాలు మరింత సుందరంగా మారాయి. మారిన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. కెమెరాలో బంధిస్తున్నారు సందర్శకులు.
శీతాకాలంలో ఉండే వాతావరణం ఇప్పుడు ముందే అరకులో దర్శనమిస్తుండడంతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడు తున్నాయి. పొగమంచుతో పాటు చల్లనిగాలులు తోడవడంతో ఈ వాతావరణాన్ని పర్యాటకులు ఎంతో ఆస్వాదిస్తున్నారు. అసలే దసరా సెలవు దినాలు కావడం.. కూల్ క్లైమేట్ ఆహ్వానిస్తున్నాడంతో.. ఆస్వాదించకుండా ఉంటారా..? అందుకే క్యూ కడుతున్నారు సందర్శకులు.
ఎండాకాలంలో మలయమారుతంలా వీసే చల్లటి గాలులు పర్యాటకులను సేదరిస్తే,.. వర్షాకాలంలో ఎటు చూసినా కొండలపై జలపాతాల హోయలు కనువిందు చేస్తూ ఉంటాయి. శీతాకాలంలో మంచు అందాలు అరకులోయకు మరింత వన్నె చేకూరుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది పొడవునా ప్రకృతి అందాలు అరకులోయ మరింత ఇనుమడింప చేస్తూ పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఒక్కటేమిటి జలజల పారే జలపాతాలు, మంచు సోయగాలు, ఎత్తైన కొండలు, పచ్చని తివాచీలా పరుచుకున్న తోటలు, అత్యద్భుతమైన బొర్రాగుహలు. ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే అరకులో అందాలకు కొదవేలేదు.
చాపరాయి జలవిహారి, పద్మాపురం ఉద్యానవనకేంద్రం పర్యాటకుల సందర్శన కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాయి. గిరిజన సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా మ్యూజియం నువ్వు చూసి కేరింతల కొడుతున్నారు జనం. ఎత్తైన చెట్లతో అంజోడ పార్కు వెడ్డింగ్ షూట్లకు అలవాలంగా మారింది. దీనికి తోడు వంజంగి మేఘాలకొండ.. అక్కడ కొండల మధ్యన పాలసముద్రంలో ఉండే మేఘాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. అటు పాడేరు మన్యంలోనూ.. జలపాతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
వందలాది గా వాహనాలు పర్యాటక ప్రాంతాలకు తరలి వస్తుండడంతో ఘాట్రోడ్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. టూరిస్ట్ లు అధికంగా రావడంతో అద్దె గదులకు బాగా డిమాండ్ ఏర్పడింది. రూములు దొరక్క పోయిన ఖాళీ ప్రదేశాల్లో పర్యాటకులు చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు అద్దె గదులు, హోటళ్లు పూర్తిగా నిండి పోయాయి.
ఈమధ్య కాలంలో అరకులోయకు ఇంత భారీ స్థాయిలో పర్యాటకులు సందర్శనకు రావడం ఇదేనాని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా కోవిడ్ నేపథ్యంలో గత మూడేళ్లుగా అరకు పర్యాటకులు ముఖం చాటేసారు. ఎప్పుడు మళ్లీ పరిస్థితులు చక్కబడడం.. వాతావరణం కూడా అనుకూలంగా మారడం.. ఆపై దసరా సెలవులు తోడవడంతో.. ఇబ్బందులు ఎదురైనా పర్యాటకులు అరకులోయ, అల్లూరి మన్యం ప్రకృతి అందాలు విక్షీంచేందుకు వస్తూనే ఉన్నారు.
Reporter: Khaja
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..