రోజూ కప్పు దొండకాయలు తింటే.. డాక్టర్‌తో పన్లేదిక!! 

17 December 2024

Ravi Kiran

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రీ-డయాబెటిక్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. డైట్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయాలి

డయాబెటిస్ రోగులు కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అయితే వారికి ఇంకొన్ని ఫుడ్స్ దివ్యౌషధంలా పని చేస్తాయి. అందులోనే ఒకటి దొండకాయలు. 

దొండకాయలను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు అందుతున్నాయి.   

దొండకాయలు తింటే డయాబెటిస్, మూత్రాశయ వ్యాధులు, చర్మ సమస్యలు తగ్గుతాయని, కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయని అంటున్నారు. 

దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని, వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుందని పేర్కొంటున్నారు వైద్యులు.

అలాగే దొండకాయలతో మలబద్దకం, అసిడిటీ వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.