Kanguva: థియేటర్స్‌లో దెబ్బేసింది.. కానీ ఓటీటీలో అదరగొడుతుంది..
సూర్య నటించిన కంగువ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు నయా రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయింది సూర్య లేటెస్ట్ మూవీ కంగువ. భారీ అంచనాల మధ్య కంగువ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్బింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన సూర్య ‘కంగువ’ చిత్రం ఓటీటీలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, రెడ్టిన్ కింగ్స్లీ, నటరాజన్ సుబ్రమణియన్, కెఎస్ రవికుమార్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా సూర్య హీరోగా తెరకెక్కిన కంగువ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించారు. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో 10కి పైగా భాషల్లో రూపొందింది.
ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!
దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. సినిమా చాలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్రబృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ సినిమాలోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో డైలాగ్ అర్థం కావడం లేదని సినిమా చూసిన వారు విమర్శించారు. థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని కంగువ ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించింది. గంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా.. ఓటీటీలో మంచి మంచి ఆదరణ అందుకుంటుంది ఈ సినిమా. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.