AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashmir: భూలోక స్వర్గం కశ్మీర్‌లో ఈ 3 చాలా సుందరమైన ప్రదేశాలు.. ప్రతి ఒక్కరు చూడదగినవి..

Kashmir: కశ్మీర్ గొప్ప పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఏడాది పొడవునా అందమైన దృశ్యాలను చూడవచ్చు. కశ్మీర్‌లో ప్రతిచోటా

Kashmir: భూలోక స్వర్గం కశ్మీర్‌లో ఈ 3 చాలా సుందరమైన ప్రదేశాలు.. ప్రతి ఒక్కరు చూడదగినవి..
Kashmir
uppula Raju
|

Updated on: Aug 23, 2021 | 8:13 PM

Share

Kashmir: కశ్మీర్ గొప్ప పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఏడాది పొడవునా అందమైన దృశ్యాలను చూడవచ్చు. కశ్మీర్‌లో ప్రతిచోటా పచ్చని భూమి కనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించవచ్చు. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో కశ్మీర్ పర్యటన చేస్తే చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఆల్పైన్ గడ్డి మైదానాలను కూడా చూడవచ్చు. మీరు కశ్మీర్‌కు వెళ్లాలని ఆలోచిస్తుంటే ఏ ప్రదేశాలను సందర్శించవచ్చో తెలుసుకుందాం.

1. శ్రీనగర్ కశ్మీర్‌లోని శ్రీనగర్ అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. పర్యాటకులు ఇక్కడ మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలను చూడవచ్చు. దాల్ సరస్సు శ్రీనగర్‌లో ప్రధాన ఆకర్షణ. దీని దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కాకుండా మీరు షాలిమార్ బాగ్, మొఘల్ గార్డెన్, ఇందిరాగాంధీ మెమోరియల్, తులిప్ గార్డెన్, నిగీన్ లేక్, వులర్ లేక్ చూడవచ్చు. పరీ మహల్‌లో కొంత సమయం గడపవచ్చు. శ్రీనగర్ సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నుంచి అక్టోబర్ వరకు. శీతాకాలంలో హిమపాతాన్ని ఆస్వాదించడానికి మాత్రం డిసెంబర్, జనవరి నెలలు అనుకూలం. ఆరులోయ, బేటాబ్ వ్యాలీ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

2. గుల్మార్గ్ – గుల్మార్గ్ పిర్ పంజల్ శ్రేణిలోని హిమాలయ లోయలో ఉంటుంది. గుల్మార్గ్ ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్ మాత్రమే కాకుండా అద్భుతమైన స్కీయింగ్ గమ్యస్థానం. మీరు ఇక్కడ పూల పొలాలను ఆస్వాదించవచ్చు. మీరు జూన్ నుంచి అక్టోబర్ వరకు సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్కీయింగ్, పర్వత బైకింగ్, ట్రెక్కింగ్, ఐస్ స్కేటింగ్ వంటి అనేక కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు.

3. సోన్‌మార్గ్ – సోన్‌మార్గ్‌ ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ అనేక రకాల ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నందున ఈ ప్రదేశం సాహస ప్రియులకు స్వర్గం. ఇక్కడ మీరు ట్రెక్కింగ్, వాటర్ రివర్ రాఫ్టింగ్ చేయవచ్చు. గడ్సర్ సరస్సు, సత్సర్ సరస్సు, గంగాబల్ సరస్సు, కృష్ణసర్ సరస్సు, విష్ణసర్ సరస్సు వంటి ప్రసిద్ధ సరస్సులు ఉంటాయి. జూన్ నుంచి అక్టోబర్ నెలలో సోన్‌మార్గ్‌ని సందర్శించి అందాలను ఆస్వాదించండి.

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Weight Lose Tips: జీవన శైలిలో ఈ 5 మార్పులు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు..! ఏంటో తెలుసుకోండి..

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే