Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తలైవి సినిమా. అరవింద స్వామి కీలక పాత్రలో నటించిన

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తలైవి మూవీ విడుదలకు డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?
Kangana Ranaut Starrer Thalaivi
Follow us
Subhash Goud

|

Updated on: Aug 23, 2021 | 7:46 PM

Kangana Ranaut Thalaivi: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తలైవి సినిమా. అరవింద స్వామి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏ.ఎల్‌ విజయ్‌ డైరెక్షన్‌ వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తుండగా, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. గత సంవత్సరం విడుదల కావాల్సిన ఈ సినిమా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

సెప్టెంబర్‌ 10వ తేదీన థియేటర్‌లోకి రానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న విబ్రి మీడియా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించించింది. ‘ఐకానిక్‌ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్‌ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 10న విడుదల చేయబోతున్నాం’ అని తెలిపారు. ఈ సినిమాను విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు.

ఈ తలైవి సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

తలైవి ప్రతి మలుపులో శాశ్వత అనుభవాలతో విస్తృతమైన ప్రయాణం చేశాం. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున అభిమానులు వెండి తెరపై లెజెండ్ జయలలిత జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగలరని సంతోషిస్తున్నాము అని నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి ఒక ప్రకటనలో తెలిపారు. జయలలిత ఎప్పుడూ సినీ రంగానికి చెందినవారు. ఆమె కథను సజీవంగా తెరపైకి తీసుకురావడమే ఈ గొప్ప లెజెండ్ కి విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడానికి ఏకైక మార్గం అని అని ప్రకటించారు.

దివంగత రాజకీయ నాయకురాలు నటి జె.జయలలిత జీవితం ఆధారంగా తలైవి తెరకెక్కగా.. ఆమె జీవితంలోని విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. చిన్న వయస్సులోనే నటిగా తమిళ సినిమాల్లో ప్రవేశించి ఆ తర్వాత కథానాయికగా ఎదిగారు. విప్లవ నాయకురాలిగా సత్తా చాటారు. తమిళనాడు రాజకీయాల గమనాన్ని మార్చిన శక్తి అయ్యారు. ఈ చిత్రం కోసం కంగన మారిన రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ పాటలు ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి.

ఇవీ కూడా చదవండి:

Actress Priyanka Pandit: మరో భోజ్‌పురి నటి ప్రైవేటు వీడియో లీక్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌..!

SR Kalyanamandapam: ఆహాలో ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?