Telangana tourism: ఒక్కరోజులో యాదాద్రి టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ఓ సూపర్‌ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే టూర్‌ పూర్తి అయ్యేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. యాదగిరి గుట్ట ప్యాకేజీ టూర్‌ పేరుతో ఆ టూర్‌ను ఆపరేట్‌ చేస్తోంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana tourism: ఒక్కరోజులో యాదాద్రి టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
Yadadri
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2024 | 11:13 AM

సమ్మర్ హాలీడేస్‌ వచ్చేశాయ్‌. ఎక్కడికైనా వెళ్దామంటూ పిల్లలు మారాం చేస్తుంటారు. అయితే ఉద్యోగరీత్యా లేదా మరే కారణంతోనైనా లీవ్‌ తీసుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. మరి కేవలం ఒకే రోజులో చిన్న టూర్‌ వేస్తే భలే ఉంటుంది కదూ. మీరు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారా.?

అయితే మీకోసమే తెలంగాణ టూరిజం ఓ సూపర్‌ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే టూర్‌ పూర్తి అయ్యేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. యాదగిరి గుట్ట ప్యాకేజీ టూర్‌ పేరుతో ఆ టూర్‌ను ఆపరేట్‌ చేస్తోంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర వివరాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా మినీ బస్‌లో ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ఉదయం బయలు దేరీ మళ్లీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. ప్రతీ శనివారం ఈ టూర్‌ అందుబాటులో ఉంటుంది.

టూర్‌ ఇలా సాగుతుంది..

* ఉదయం 9 గంటలకు బషీర్​బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు ప్రయాణం ప్రారంభమవుతుంది.

* తొలుత ఉదయం 10.30 గంటలకు సమయానికి కొలనుపాకుకు చేరుకుంటారు. అక్కడ ఉండే జైన ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది.

* ఇక అక్కడి నుంచి బయలుదేరి యాదగిరి గుట్టకు చేరుకుంటారు. 11.30 గంటల సమాయానికి యాదాద్రికి చేరుకుంటారు.

* అనంతరం 12.30 గంటలకు శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది.

* ఆ తర్వాత గుట్ట కింద ఉండే హరిత హోటల్‌లో భోజనం ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు హోటల్‌లోనే ఉంటారు.

* ఇక యాదాద్రి నుంచి 4 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు సురేంద్రపురికి వెళ్తారు. అక్కడ ఉండే కుందా సత్యనారాయణ కళాధామం సందర్శించిన తర్వాత రాత్రి 7:30 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

* రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవడంతో ఈ టూర్‌ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్‌ ప్యాకేజీ ధరల విషయానికొస్తే పెద్దలకు రూ. 1499కాగా పిల్లలకు రూ. 1199గా నిర్ణయించారు. ఇక దర్శనం, ఎంట్రీ టికెట్స్‌, మధ్యాహ్నం భోజనం వంటివి ప్యాకేజీలో కవర్‌ కావు. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు, టూర్‌ బుక్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!