AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niagara Falls: సరికొత్త శోభను సంతరించుకున్న ‘నయాగరా’..మంచుకొండను తలపిస్తున్న జలపాతం..

Niagara Falls: అమెరికా- కెనడా సరిహద్దుల్లో ఉన్న ప్రసిద్ధ నయాగర జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ రెండు దేశాలకు

Niagara Falls: సరికొత్త శోభను సంతరించుకున్న 'నయాగరా'..మంచుకొండను తలపిస్తున్న జలపాతం..
Rajitha Chanti
|

Updated on: Mar 02, 2021 | 7:23 PM

Share

Niagara Falls: అమెరికా- కెనడా సరిహద్దుల్లో ఉన్న ప్రసిద్ధ నయాగర జలపాతం సరికొత్త శోభను సంతరించుకుంది. ఈ రెండు దేశాలకు మిక్కిలి పర్యాటక కేంద్రంగా ఈ జలపాతం ప్రసిద్ధి చెందింది. శీతకాలం కావడంతో నయాగర అందాలు మరింత అందాన్ని పులుముకున్నట్టుగా కనిపిస్తున్నాయి. గడ్డకట్టిన మంచు, తెల్లటి రంగుతో కాంతునీనుతున్న పరిసరాల మధ్య జాలువారుతున్న జలపాతం సందర్శకులను కట్టిపడేస్తోంది. ఇదే సమయంలో ఆకాశంలో ఏర్పడ్డ ఇంద్రధనస్సు నయాగరాకు మరింత వన్నె తెచ్చింది. ఓ వైపు గడ్డకట్టిన నీరు.. మంచుకొండను తలపిస్తున్న జలపాతం, మధ్యలో నుంచి పారుతున్న సెలయేరును చూసి సందర్శకులు మంత్రముగ్ధులవుతున్నారు. సమీప ప్రాంతాలలో ఉష్ణోగ్రతల స్థాయి పడిపోతుంది. అలాగే చుట్టు మంచుతో కప్పబడిపోయింది.

నయాగరా జలపాతాన్ని మంచు కప్పెసి.. మంచు భాగాలు అద్భుతంగా శీతకాలపు వండర్ ల్యాండ్ మాదిరిగా దర్శనమిస్తుంది. మంచు యువరాణి ఎల్సా నిజంగానే ఇక్కడ పరిపాలించిందా ? అనే సందేహాన్ని రుజువు చేస్తున్నట్లుగా ఇక్కడి అందాలు కనిపిస్తున్నాయి. కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ.. అమెరికన్ సరిహద్దుల్లోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని చూడటానికి భారీగా వస్తున్నారు.

ఇక జలపాతంపై ఏర్పడే ఇంద్రధనస్సు ఈ నయాగరా జలపాతాలకు మరింత అందానిస్తున్నాయి. ఈ జలపాతం తాత్కలికంగా మూసివేయబడింది. ఇక ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఇక్కడి పరిసర ప్రాంతాలన్ని మంచుతో కప్పబడి ఉన్నాయి. 1938లో కూడా అమెరికా వైపు ఈ జలపాతం ఇలాగే పూర్తిగా మంచుకొండల మారిపోయింది. ఇక 1848లో రెండు వైపులా పూర్తిగా మంచుతో కప్పబడి పోయింది. ప్రస్తుతం మరోసారి ఈ నయాగరా ఫాల్స్ మంచుతో కప్పబడి ఉన్నాయి. వాటి అందాలను మీరు ఒకసారి చూసేయ్యండి.

Also Read:

Amla Benefits: ఉసిరి కాయతో చర్మ సమస్యలు తగ్గుతాయా ? ఉసిరితో ఎన్ని రకాలు ప్రయోజనాలున్నాయంటే..

ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గుంటలు మాయం…

ఉపాది కల్పనకు పర్యాటక రంగమే ప్రధాన వనరు..జమ్ములో మార్పు తేవడానికి ఇదే సరైన మార్గం…