- Telugu News Photo Gallery Spiritual photos Peddagattu lingamanthula swamy jatara grandly held in suryapet district
Peddagattu Jathara : అంగరంగ వైభోగంగా సాగుతున్న లింగమంతుల స్వామి జాతర.. మొక్కులు తీర్చుకుంటున్న మంత్రులు, భక్తులు
తెలంగాణ లోనే కాదు ఆసియాలోనే రెండో అతిపెద్ద జాతర. దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభోగంగా సాగుతోంది. యాదవుల ఆరాధ్యదైవమైన గొల్లగట్టు జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.
Updated on: Mar 02, 2021 | 3:41 PM

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభోగంగా సాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు, పసుపు బియ్యం సమర్పిస్తూ స్వామివారికి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

యాదవుల ఆరాధ్యదైవమైన గొల్లగట్టు జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లిస్తున్నారు

ఈ జాతరకు 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. మేడారం జాతర మాదిరిగానే ఈ జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు. ఈ జాతర ఆసియాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచింది.

తమ సంపదలైన గొర్ల జీవాలను, తమను మృగాల బారి నుంచి కాపాడాలని లింగమంతుల స్వామి ని మొక్కుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు యాదవులు. లింగమంతుల స్వామిని తమ కులదైంగా యాదవులు కొలుస్తారు.

ఈ జాతరలో లింగమంతుస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మంత్రులు తలసాని, జగదీష్ రెడ్డి లింగమంతుల స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు

భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సదుపాయాలు జిల్లా అధికార యంత్రాంగం కల్పించింది. కోవిడ్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జాతరలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టింది. దురాజ్ పల్లి భక్తుల సందడి నెలకొంది.




