Amla Benefits: ఉసిరి కాయతో చర్మ సమస్యలు తగ్గుతాయా ? ఉసిరితో ఎన్ని రకాలు ప్రయోజనాలున్నాయంటే..
భారత్‌లో ఎక్కువగా ఉసిరిని ఊరగాయకు ఉపయోగిస్తుంటాం. ఇక కొంతమంది నేరుగా తినడానికే ఇష్టపడతుంటారు. ఇక మారుతున్న
భారత్‌లో ఎక్కువగా ఉసిరిని ఊరగాయకు ఉపయోగిస్తుంటాం. ఇక కొంతమంది నేరుగా తినడానికే ఇష్టపడతుంటారు. ఇక మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో ఉసిరి పొడి లభిస్తుంది. కేవలం ఉసిరికాయను పచ్చడిగానే కాకుండా జ్యూస్‌గా, మురబ్బాగా, సిరప్‌గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. రసం తీసి తాగిన, చూర్ణంగా తీసుకున్నా, మురబ్బా చేసుకుని చప్పరించినా, రోట్లో పచ్చడి చేసినా.. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇక మనకు ఉసిరి వలన కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందాం..
జలుబు, దగ్గు తగ్గిస్తుంది..
ఉసిరికాయలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. దీంతో జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఉసిరి రక్తహీనతను నివారిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు ఎక్కువగా ఉసిరి తినడం వలన బాడీలోని వ్యర్థ కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఉసిరిపొడిని నీటిలో కలిపి తాగితే గుండె సమస్యలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గిస్తుంది.
స్కిన్ ప్రొటెక్షన్ కోసం..
మీరు రోజూవారీ డైట్లో ఉసిరి కాయను తీసుకోవడం వలన కాంతివంతంగా ఉంటుంది. అలాగే చర్మంపై నల్లని మచ్చలను తొలగిస్తుంది. ఇవే కాకుండా ముఖంపై పింపుల్స్ వల్ల ఏర్పడిన స్కార్స్ పై ఉసిరి రసం అప్లయ్ చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే ఉసిరిని పేస్ట్ చేసి తలకు పట్టిస్తే.. చుండ్రు సమస్య తగ్గుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యను కూడా నివారిస్తుంది.
జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది..
ఉసిరిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అందుకే దీనిని రోజూవారీ డైట్ లో చేర్చితే జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించడంలోనూ ఉసిరి సహకరిస్తుంది. అలాగే నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యను కూడా ఉసిరి తగ్గిస్తుంది.
ఉసిరి కాయను ఎలా తీసుకోవాలి..
ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండడంతోపాటు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం లోపంతో బాధపడేవారికి ఐరనన్ సమస్యను తగ్గిస్తుంది.
ఉసిరి జ్యూస్ ..
పచ్చి ఉసిరి కాయలను ముక్కలుగా చేసి మిక్సర్లో వేసి రసం తీసుకోవాలి. ఈ జ్యూస్‌ని వడగట్టుకుని కొంచెం ఉప్పు, పంచదార, లెమన్ మిక్స్ చేసి తాగొచ్చు. రోజూ ఈ జ్యూస్‌ని గోరు వెచ్చని నీటిలో మిక్స్ చేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి ఆమ్లా జ్యూస్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఉసిరి రసం పుక్కిలిస్తే మౌత్ అల్సర్లు తగ్గుతాయి. పలుచని మజ్జిగలో ఉసిరి జ్యూస్, నిమ్మ రసం, వాము కలిపి తాగితే తక్షణ శక్తిని ఇస్తుంది. ఉసిరి రసం, అల్లం రసం, చక్కెర సమపాళ్లలో కలిపి రోజుకు రెండు పూటలు 25 మిల్లీ లీటర్ల పరిమాణంలో తాగితే నీరసం, కళ్లు తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఆమ్లా రైస్ ..
అన్నంతో కలిపి ఆమ్లాను తినాలనుకునే వారికి ఉసిరి అన్నం మంచిది. నూనె, శనగ పప్పు, మినప పప్పు, జీడి పప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకును పాన్‌లో వేయించుకుని ఓ రెండు నిమిషాల తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఉసిరి, పసుపు, ఉప్పు వేయాలి. బాగా వేగాక అన్నంలో ఈ మిశ్రమాన్ని కలిపితే ఆమ్లా రైస్ రెడీ. వేడివేడిగా తిన్నా.. చల్లారాక తిన్నా టేస్టీగానే ఉంటుందీ రైస్.
Also Read:
ముఖం మీద గుంటలతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయితే గుంటలు మాయం…