Kidney Stone Diet : కిడ్నీల్లో రాళ్ళతో బాధపడుతున్నారా? అప్పుడు పొరపాటున కూడా ‘ఈ’ ఆహారాన్ని తినవద్దు.. !

ఎవరికైనా కిడ్నీల్లో రాళ్లు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మూత్రపిండాల సమస్య ఉంటే, ఆ నొప్పులు ఎంత తీవ్రంగా ఉంటుందో ఆ బాధను అనుభవించినవారికి తెలుసు..

  • Surya Kala
  • Publish Date - 2:14 pm, Tue, 2 March 21
Kidney Stone Diet : కిడ్నీల్లో రాళ్ళతో బాధపడుతున్నారా? అప్పుడు పొరపాటున కూడా 'ఈ' ఆహారాన్ని తినవద్దు.. !

Kidney Stone Diet : కిడ్నీల్లో రాళ్లు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటె ఆ సమస్యను భరించడం కష్టమని అందరికీ తెలుసు. ఇక ఈ వ్యాధి దీర్ఘకాలికమైంది. కిడ్నీల్లో స్టోన్స్ ఉన్న సమయంలో ఒకొక్కసారి రోగి ఆ బాధను భరించడం కష్టం .. అంతేకాదు కిడ్నీ స్టోన్స్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండే వ్యాధి. ఒక్కసారి మూత్ర పిండాల సమస్య తగ్గింది అనుకుని రిలాక్స్ అయితే.. మళ్ళీ కొంత కాలానికి కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడుతున్నాయని బాధిత రోగులు అంటున్నారు. అయితే కిడ్నీల్లో స్టోన్స్, సమస్యలను తగ్గించుకోవడానికి పునరావృతం కాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా తినే ఆహారం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.

కిడ్నీ స్టోన్ రోగులు ఏ ఏ ఆహారానికి దూరంగా ఉండాలంటే..

మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్ లేదా భాస్వరం వంటి రసాయనాలతో కలిస్తే మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. అలాగే, మూత్రపిండాలలో యూరిక్ యాసిడ్ ఏర్పడటం తరచుగా మూత్రపిండాల్లో స్టోన్స్ కు కారణమని నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తెలిపింది. అందుకనే కిడ్నీ స్టోన్ సమస్యలు ఉండకూడదని ఎవరైనా భావిస్తే.. వారు ఈ పదార్ధాలను పరిమితంగా తీసుకోవాలని .. ఇక ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారుంటే అసలు ఈ ఆహారం జోలికి వెళ్లవద్దని సూచిస్తుంది.

1. బచ్చలికూర

దీనిలో ఐరెన్, విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బచ్చలికూర తినడం మానేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది. అందుకని మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయలేవు . ఇది శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్ళదు, దీనివల్ల మూత్రపిండాలలో నిల్వ ఉండి చక్కటి రాళ్ళు ఏర్పడతాయి.

ఆక్సలేట్ ఫుడ్ :

బచ్చలికూరతో పాటు, బీట్‌రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ వంటి వాటిల్లో అధిక ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. రోగికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. తప్పని సరిగా డాక్టర్ వారికి ఆక్సలేట్ ఉన్న ఆహారం తినవద్దని.. లేదా తక్కువుగా తినమని సలహా ఇస్తాడు.

కోడి, చేప, గుడ్లు

రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అందుకని వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. అయితే శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది కనుక టోఫు, క్వినోవా, కూరగాయల విత్తనాలు మరియు గ్రీకు పెరుగు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఆహారంగా తినాలి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి.

సోడియంను తక్కువుగా ఉపయోగించాలి.

ఉప్పులో సోడియం ఉంటుంది. ఇక సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం ఏర్పడుతుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు కలపడం మానుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉండే ఆహారం , ఉప్పు ఉన్న చిప్స్ ను తినడం తగ్గించాలి.

శీతల పానీయాలు :

కోలాలో ఫాస్ఫేట్ అనే రసాయనం ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అందువల్ల, నిల్వ చేసిన ఆహారాలు మరియు పానీయాలను అధికంగా తాగవద్దు. ఉప్పు మాత్రమే కాకుండా అధిక చక్కెర, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ లు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారకాలు మారే ప్రమాదం ఉంది

Also Read:

మోదీని ప్రశంసిస్తారా..? గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం.. దిష్టిబొమ్మ దగ్ధం..

Vakeel Saab On OTT : పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్‌లో రిలీజ్ డేట్ వచ్చేసిందిగా