AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check : ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం.. కిడ్నీ వ్యాధులకు, జుట్టు రాలడం, కిడ్నీ సమస్యలకు కారణమా..!!

ఆధునికం పేరుతో మనిషి చేసే చేష్టలతో ప్రకృతి ఎప్పుడో గతి తప్పింది.. వేళ కానీ వేళలో వర్షాలు... ఎండలు.. ఇలా అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి.. ఇక భూమి పై రోజు రోజుకీ తాపం అధికం...

Fact Check : ప్లాస్టిక్ బాక్స్‌లో ఆహారం.. కిడ్నీ వ్యాధులకు, జుట్టు రాలడం, కిడ్నీ సమస్యలకు కారణమా..!!
Surya Kala
|

Updated on: Mar 02, 2021 | 3:31 PM

Share

Fact Check : ఆధునికం పేరుతో మనిషి చేసే చేష్టలతో ప్రకృతి ఎప్పుడో గతి తప్పింది.. వేళ కానీ వేళలో వర్షాలు… ఎండలు.. ఇలా అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి.. ఇక భూమి పై రోజు రోజుకీ తాపం అధికం అవుతున్నది. ఇలా భూ తాపం పెరగడానికి ముఖ్య కారణాల్లో ఒకటి ప్లాస్టిక్ వాడకం.. అవును ప్లాస్టిక్ వాడకం.. ఇప్పుడు ప్రపంచానికి పెను సవాల్ గా మారింది. ఈ ప్లాస్టిక్ ని బైస్ఫినాల్ ఏ.. అనే పదార్ధంతో తయారు చేస్తారు.. అందుకని ఈ ప్లాస్టిక్ భూమిలో కరగదు.. అందుకని వ్యర్ధ ప్లాస్టిక్ ని మంటలో వేసి తగల బెడుతున్నారు. ఆ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే వాయువులను ఆ ప్లాస్టిక్ వెలువరిస్తుంది. ఎన్ని విధాలుగా చెప్పినా సరే ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకీ ఎక్కువ అయ్యింది. అయినప్పటికీ ప్లాస్టిక్ ని మనం దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకొని వాడుకొంటున్నాం.

అందంగా ఆకర్షణీయంగా రకరకాల రంగుల్లో చూడగానే ఆకర్షిస్తుంది ప్లాస్టిక్. అందుకే పిల్లలు, పెద్దలతో సహా ప్లాస్టిక్ లంచ్ బాక్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడేస్తుంటారు. కాగా ప్లాస్టిక్ బాక్స్ ల్లో టిఫిన్, లంచ్ లు పెట్టి ఆఫీసులకు, చిన్నారులను స్కూల్స్ కి పంపుతున్నాం.. ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో ఆహార పదార్ధాలను పెట్టి తినడం ఆరోగ్యానికి హానికరం. కానీ తినే ఆహార పదార్థాలు వాటిల్లో తీసుకు వెళ్లి తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు అత్యంత హానిని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్లాస్టిక్ లో పెట్టిన ఆహార పదార్ధాలు తినడం వల్ల అనేక రోగాలు ఉత్పన్నమవుతాయి అని అంటున్నారు వైద్యులు.

ప్లాస్టిక్ కూడా ఒక రకమైన విష పదార్ధం అని.. వీటిలో నిల్వ చేసే ఆహారం తినడంతో ఎక్కువగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది అని.. కిడ్నీల వ్యాధులు సోకే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కంటెయినర్లు తయారు చేసే బైస్ఫినాల్ ఏ (బీపీఏ) వేడి వేడి గా ఆహార పదార్ధాలతోనే కాదు.. ద్రవరూపంలో కూడా ఉండే ఆహార పదార్ధాలకు అంటుకొని ఉంటుంది అని.. ఆ ఆహారం మనకు ఏ విధంగా విషతుల్యం అయ్యింది తెలియక మనం తిని అనేక రోగాలకు గురి అవుతున్నామని వైద్యులు చెబుతున్నారు.. అందుకనే ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి హానికరం.. ముఖ్యంగా కిడ్నీ పనితీరుపై ప్లాస్టిక్ ప్రభావం చూపుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి ఆహారాన్ని నింపడం ద్వారా యాసిడ్ పదార్థాలు ఉత్పత్తి అయ్యి కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇకపోతే జుట్టు ఊడడం కూడా ఖాయమంటున్నారు బెంగుళూరుకు చెందిన హెయిర్‌లైన్ ఇంటర్నేషనల్ అండ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు. అంతే కాకుండా రక్తంలో బీపీఏ (బిస్పెనాల్ -ఏ) పెరిగేందుకు కారణమవుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు ఏది పాటు 430 మంది యువతులు, 570 మంది పురుషులపై అధ్యయనం జరిపి ఈ విషయం వెల్లడించారు. సుమారు 70 శాతం మెటబాలిక్ వ్యాధులు జుట్టు రాలిపోవడంతోనే ప్రారంభమవుతున్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. మైక్రోవేవ్ ఓవెన్లలో వాడడం ద్వారా శరీరంలోకి మరింత ప్లాస్టిక్ చేరుతోందని అపోలో హాస్పిటల్ క్లినికల్ డైటీషియన్ చీఫ్ ప్రియాంకా రోహత్గి అభిప్రాయపడ్డారు. అందుకే వీటి స్థానంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌ని వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి ఈ రోజు నుంచే ప్లాస్టిక్ బాక్స్ ల్లో టిఫిన్స్ , లంచ్ ను తీసుకెళ్లడం తగ్గిందాం . పర్యావరణంలో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!

Also Read:

 కిడ్నీల్లో రాళ్ళతో బాధపడుతున్నారా? అప్పుడు పొరపాటున కూడా ‘ఈ’ ఆహారాన్ని తినవద్దు.. !

ఉసిరి కాయతో చర్మ సమస్యలు తగ్గుతాయా ? ఉసిరితో ఎన్ని రకాలు ప్రయోజనాలున్నాయంటే..