సెలవులను ఎంజాయ్ చేయడానికి భారతీయులు విదేశాలకు క్యూ.. ఏ దేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే

కాలు పెట్టడానికి కూడా వీల్లేనంతగా విమానాలు కిటకిటలాడిపోతున్నాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేయడానికి జనం చలో అంటూ వెళ్లిపోతున్నారు. దేశవిదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతున్నారు. ఇండియా కంటే ఫారిన్‌ ట్రిప్పులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఫ్లైట్‌ టికెట్ల బుకింగులు ఓ రేంజ్‌లో ఉన్నాయి.

సెలవులను ఎంజాయ్ చేయడానికి భారతీయులు విదేశాలకు క్యూ.. ఏ దేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే
New Year 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 24, 2024 | 9:41 AM

క్రిస్మస్‌, న్యూ ఇయర్‌, ఆ తర్వాత సంక్రాంతి హాలీడేస్‌…ఇలా వరుసగా సెలవులే సెలవులు రావడంతో అంతా ఊళ్ల బాట పట్టారు. నచ్చిన డెస్టినేషన్లకు వెళ్లిపోవడానికి రెక్కలు కట్టుకుని మరీ ఎగిరిపోతున్నారు. భారత దేశం నుంచి కొన్ని దేశాలకు విమానాల టికెట్‌ బుకింగ్స్‌, ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ఇప్పటికే విపరీతంగా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ అయిపోయాయి. మనోళ్ల దృష్టిలో ఇండియాలో కంటే ఫారిన్‌లోనే ఎక్కువ హాట్‌ టూరిస్ట్‌ స్పాట్లు ఉన్నట్లున్నాయి. దేశీ డెస్టినేషన్స్‌ కంటే…విదేశీ డెస్టినేషన్స్‌కే జనం జై కొడుతున్నారు. జామ్మంటూ వెళ్లిపోతున్నారు.

ఆఫర్ల వల విసిరేస్తున్న ఎయిర్‌లైన్స్‌.. భారీ డిస్కౌంట్లు

విమానయాన సంస్థలు పోటీ పడి మరీ ఆఫర్లు ఇస్తున్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకే టికెట్లు అందిస్తామంటున్నాయి ఎయిర్‌ లైన్స్‌. తగ్గింపు ధరలతో పాటు యాడ్‌-ఆన్‌లపై గరిష్టంగా 15 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. మరికొన్ని ఎయిర్‌లైన్స్‌…కస్టమర్లకు దేశీయంగా 15 శాతం, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌లను పొందొచ్చంటూ ఆఫర్ల వల విసిరేస్తున్నాయి.

ఏ దేశాలకు టికెట్స్ ఎక్కువగా బుక్ అయ్యాయంటే

దీంతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఫారిన్‌ ఫ్టైట్‌ టికెట్‌ బుకింగ్స్‌.. ఓ రేంజ్‌కి వెళ్లిపోయాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ని ఎంజాయ్‌ చేయడానికి ఇండియా టు బ్యాంకాక్‌ 166 శాతం అధికంగా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ అయ్యాయి. ఇండియా టు పుకెట్‌ 168 శాతం టికెట్లు బుక్‌ అయ్యాయి. ఇండియా టు అబుదాబి వెళ్లే ఫ్లైట్లలో 174 శాతం అధికంగా టికెట్లు బుక్కయ్యాయి. ఇండియా టు కొలంబో.. 37 శాతం మాత్రమే అధికంగా ఫ్లైట్‌ టికెట్లు బుక్కయ్యాయి. అంటే శ్రీలంక వెళ్లడానికి జనం అంత ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు. ఇక ఇండియా టు సింగపూర్‌ ఫ్లైట్‌ టికెట్లు కూడా 53 శాతం ఎక్కువగా బుక్కయ్యాయి. ఇక ఇండియా టు లండన్‌ మాత్రం 80 శాతం ఎక్కువగానే బుక్కయ్యాయి. ఇక వియత్నాం మీద మనోళ్లకు ఎందుకు మోజు పుట్టిందో తెలియదు గానీ, ఆ ఫ్లైట్లలో డబుల్‌ అంటే.. 102 శాతం ఎక్కువగా టికెట్లు బుక్కయ్యాయి. భారతీయులకు ఇష్టమైన దుబాయ్‌కి మాత్రం 48 శాతం మాత్రమే ఎక్కువగా ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

దేశీయంగా ఎక్కువగా ఏ ప్రాంతాలకు టికెట్స్ బుక్ అయ్యాయంటే

దేశీయంగా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. కొత్త ఏడాదికి వెళ్లేందుకు ఎంచుకున్న ప్రాంతాల్లో జమ్మూ కశ్మీర్ మొదటి ఎంపిక. చలో జమ్మూ అంటున్నవాళ్లు 147 శాతం ఎక్కువగా ఫ్లైట్‌ టికెట్లను బుక్‌ చేసుకున్నారు. శ్రీనగర్‌ 66 శాతం హైక్‌తో సర్దుకుంది. డెహ్రాడూన్‌ మాత్రం తగ్గేదే లేదన్నట్లు 87 శాతం అధికంగా నమోదు చేసింది. ఇక సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న ఉదయ్‌పూర్‌కి ఫ్లైట్‌ టికెట్ల బుకింగ్‌ 126 శాతం అధికంగా ఉంది. సముద్ర అందాలతో అలరారే గోవా మాత్రం 52 శాతం హైక్‌తో సరిపెట్టుకుంది. జైపూర్‌కి వెళ్లే ప్రయాణికుల్లో కూడా 51 శాతం మాత్రమే అధిక బుకింగ్స్‌ నమోదయ్యాయి. ఇక చలి పులి వణికించే లేహ్‌కి కూడా 30 శాతం ఎక్కువగా ఫ్లైట్‌ టికెట్లు బుక్కయ్యాయి. భారత దేశంలో హోటళ్ల ధర, అకామడేషన్‌ కాస్ట్‌ విపరీతంగా పెరిగిపోవడంతో చాలామంది టూరిస్టులు విదేశాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 
లక్షకు పది లక్షలు ఇస్తామన్నారు.. సరే అని రూ.6 లక్షలు ఇస్తే.. 
బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..
బాత్రూంలోకి వెళ్లిన బాలుడు.. ఎంతకీ రాకపోవడంతో..
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..జనవరి 15 వరకు గడువు పొడిగింపు
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..జనవరి 15 వరకు గడువు పొడిగింపు
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
హార్దిక్ బాటలోనే మరో టీమిండియా క్రికెటర్.. భార్యతో విడాకులు!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
ఓరీ దేవుడో ఇదేం ఇడ్లీరా సామీ.. అచ్చం బొగ్గులాగే ఉన్నాయ్..!
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
వాషింగ్‌ మెషీన్‌లో దుప్పట్లను ఉతకవచ్చా..? నిపుణులు ఏమంటున్నారు?
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఈ క్రిస్మస్‌కి ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ కేక్ చేయండి.. టేస్ట్ సూపర్!
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి