IRCTC Tour Package: ఐఆర్సీటీసీ ప్యాకేజీతో అందాల అస్సాం..మేస్మరైజింగ్ మేఘాలయ తిరిగొచ్చేయొచ్చు ఇలా..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) భారతదేశంలోని రెండు ఆసక్తికరమైన ప్రదేశాలైన అస్సాం.. మేఘాలయలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తోంది.
IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) భారతదేశంలోని రెండు ఆసక్తికరమైన ప్రదేశాలైన అస్సాం.. మేఘాలయలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తోంది. మీరు IRCTC వెబ్‌సైట్ ని ఇక్కడ క్లిక్ చేసి సందర్శించడం ద్వారా టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు.
మేఘాలయ..కామాఖ్య దేవి దర్శనం
ప్యాకేజీ పేరు- కామాఖ్య దర్శనంతో మెస్మరైజింగ్ మేఘాలయ
ఏమి చూడొచ్చంటే .. మావ్లిన్నాంగ్, చిరపుంజి, షిల్లాంగ్, గౌహతి
ట్రావెలింగ్ మోడ్ – ఫ్లైట్
విమాన వివరాలు – ఇండిగో
ఫ్లైట్ నంబర్ (6E-669/6344) ఇండిగో ఎయిర్‌లైన్స్ 11.02.2022న 09.05కి బయలుదేరి 16.40కి చేరుకుంటుంది.
తిరిగి విమానం నంబర్ (6E-394/7264) ఇండిగో ఎయిర్‌లైన్స్ 15.02.2022న 12.15కి బయలుదేరి 19.30కి చేరుకుంటుంది.
IRCTC సమాచారాన్ని ట్వీట్ చేసింది
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ గురించి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ద్వారా మావ్లిన్నాంగ్, చిరపుంజి, షిల్లాంగ్, గౌహతి టూర్ ప్యాకేజీల సమాచారాన్ని పంచుకుంది. ఈ సమయంలో, మొత్తం టూర్ సర్క్యూట్, టూర్ ప్యాకేజీ ధర గురించి సమాచారం కూడా ఇచ్చారు. మీరు కూడా ఇక్కడ సందర్శించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు ఐఆర్సిటీసి ట్విట్టర్ హ్యాండిల్ కు నేరుగా వెళ్లి సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, ట్వీట్‌లో https://bit.ly/3GhesvZ లింక్ కూడా షేర్ చేశారు. దీని ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అదే సమయంలో, మరింత సమాచారం కోసం, మీరు ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు-8287932242, 8287932329.
Explore #NorthEast #India‘s myriad treasures with this exciting 5D/4N ‘Mesmerising Meghalaya with Kamakhya Darshan’ air tour package starting at Rs.29,650/-pp*. #Booking & #details on https://t.co/aoqmQdE6LR *T&C Apply
— IRCTC (@IRCTCofficial) December 15, 2021
పర్యటన ఎప్పుడు ప్రారంభమవుతుంది?
మావ్లిన్నాంగ్, చిరపుంజి, షిల్లాంగ్, గౌహతి పర్యటన 11 ఫిబ్రవరి 2022న ప్రారంభమై 15 ఫిబ్రవరి 2022న ముగుస్తుంది. ఈ సమయంలో మీరు కామాఖ్య దేవిని సందర్శించే అవకాశం కూడా లభిస్తుంది.
పూర్తి టూర్ ప్యాకేజీ ఎన్ని రోజులు?
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ అందించే మేఘాలయ.. కామాఖ్య దేవి దర్శనం కోసం పూర్తి టూర్ ప్యాకేజీ 4 రాత్రులు.. 5 పగళ్లు. దీని కింద, నోహ్కలికై జలపాతం, మౌషుమి గుహలు, డౌకీ సరస్సు, డాన్ బాస్కో మ్యూజియం, బ్రహ్మపుత్ర నదితో సహా అనేక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా మీకు లభిస్తుంది.
టూర్ ప్యాకేజీ ధర?
ఈ టూర్ ప్యాకేజీకి వ్యక్తిని బట్టి సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39300, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.30200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.29650 అవుతుంది. అదే సమయంలో బెడ్ ఉన్న పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) రూ.28150, బెడ్ లేని పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లలోపు) రూ.23550 వెచ్చించాల్సి ఉంటుంది. COVID-19 టీకా (పూర్తి మోతాదు) 18 సంవత్సరాలు..అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి తప్పనిసరి.
ఇవి కూడా చదవండి: Bigg boss 5 Telugu: కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించిన బిగ్ బాస్.. హౌస్‌లో విరబూసిన నవ్వులు
Gadget Guru: ఇది లేకుంటే మీ బ్యాంక్ ఖాతా గుల్లే.. ఇవి షేర్ చేయకుండా ఉంటె బెటర్..(వీడియో)
Sheena Bora Case: షీనా బోరా మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. CBIకి ఇంద్రాణి సంచలన లేఖ