Three-Storey House: మామిడి చెట్టుమీద మూడు అంతస్థుల భవనం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ట్రీహౌస్‌కు చోటు..

Three-Storey House: మీరు మంచం మీద నుండి కదలకుండా తాజా మామిడి పండ్లను చేతులతో అందుకోగలరా.. మీ పడకగదిలో పక్షుల గుళ్ళు.. వాటి కిలకిలారావాలతో పులకిస్తూ.. మేల్కొని..

Three-Storey House: మామిడి చెట్టుమీద మూడు అంతస్థుల భవనం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ట్రీహౌస్‌కు చోటు..
Three Storey House
Follow us
Surya Kala

|

Updated on: Dec 17, 2021 | 11:39 AM

Three-Storey House: మీరు మంచం మీద నుండి కదలకుండా తాజా మామిడి పండ్లను చేతులతో అందుకోగలరా.. మీ పడకగదిలో పక్షుల గుళ్ళు.. వాటి కిలకిలారావాలతో పులకిస్తూ.. మేల్కొని.. రోజుని ప్రశాంతంగా మొదలు పెట్టగలరా.. ఇవన్నీ చెబుతుంటే.. డిస్ని సినిమానో.. మోగ్లీ సినిమా సన్నివేశామో అనిపిస్తుంది కదా.. కానీ నిజ జీవితంలో ఒక వ్యాపారి తన ఇంటిని ఇలాంటి సుందర దృశ్యాలు అద్దంపట్టేలా నిర్మించుకున్నారు. రాజస్థాన్ లోని అజ్మీర్‌ కి చెందిన వ్యాపారవేత్త కుల్ ప్రదీప్ సింగ్ , అతని కుటుంబంలో రోజూ జరిగే సన్నివేశాలు ఇవే..

ప్రదీప్ సింగ్ ఇల్లు ఉదయపూర్‌లో 40 అడుగుల మామిడి చెట్టుపై నిర్మించబడింది. ఈ మూడు-అంతస్తుల ట్రీహౌస్‌లో రెండు బెడ్‌రూమ్‌లు, వంటగది, లైబ్రరీ , లివింగ్ ఏరియా ఉన్నాయి. తాను ఇలా చెట్టుపై ఇంటిని నిర్మించుకోవడానికి కారణం ప్రదీప్ సింగ్ వివరిస్తూ.. “మా ట్రీహౌస్ ఉన్న ప్రాంతం పండ్ల చెట్లకు ప్రసిద్ధి చెందింది.  4,000 చెట్లకు పైగా  పండ్ల ఉండేవి.. వీటి పండ్లను విక్రయించి ప్రజలు జీవనం సాగించేవారు. అయితే జనాభా పెరుగుదల కారణంగా.. చెట్లను నరికివేయడం ప్రారంభించారని చెప్పారు.

Tree House 1

Tree House 1

1999 ఏడాదిలో ఉదయపూర్‌లో ప్రదీప్ సింగ్ తాను ఇల్లు నిర్మించుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నాడు.  ఈ ప్రాంతంలోని చెట్లకు హాని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. “చెట్లను నరకవద్దని, వాటిని మరెక్కడా నాటమని ప్రాపర్టీ డీలర్‌కి చెప్పినప్పుడు.. అతను ప్రదీప్ ఆలోచన లను తిరస్కరించి వెళ్లిపోయాడు. అప్పుడు ప్రదీప్ సింగ్ ఇల్లు కట్టుకోవడం ఒక  ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చెట్లను పెకిలించే బదులు.. దానిపైనే ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక స్థలం దాని మధ్యలో మామిడి చెట్టు.. సరసమైన ధరకు కొనుగోలు చేశారు.

Tree House 2

Tree House 2

ఒక ఆర్కిటెక్ట్ సహాయంతో సింగ్ ఇంటి నిర్మాణం ఒక సంవత్సరంలో పూర్తయింది. ఆ సమయంలో మామిడి చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తులో ఉంది. అప్పుడు ఇల్లు రెండు అంతస్తులతో నిర్మించారు.  భవనం నిర్మాణం మొత్తం ఉక్కుతో చేశారు. ఇంటి గోడలు, అంతస్తులు సెల్యులోజ్ షీట్‌తో పాటు ఫైబర్‌తో తయారు చేయబడ్డాయి. చెట్టు చుట్టూ నాలుగు స్తంభాలను ఉంచారు. ఇవి పిడుగుపాటు సమయంలో విద్యుత్ వాహకంగా పనిచేస్తాయి.

అయితే తాను ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ఖర్చు ఎంత అయిందని రికార్డ్ చేయలేదని ప్రదీప్ సింగ్ చెప్పారు. అంతేకాదు తన ఇంటి మోడల్ చూసి ఆసక్తిగల వ్యక్తులు ఇలాంటి ఇంటిని నిర్మించేందుకు తనను సంప్రదించారని సింగ్ చెప్పారు. అయితే ఒక్కరు కూడా ఇదే విధంగా ఇంటిని నిర్మించలేదని చెప్పారు.

Tree House 4

Tree House 4

మామిడి చెట్టు 11 ఏళ్లలో 20 అడుగుల నుంచి 40 అడుగులకు పెరిగింది. ఇంతకుముందు రెండంతస్తులు ఉన్న సింగ్ ఇల్లు ఇప్పుడు మూడు అంతస్థులకు చేరుకుంది. మొదటి అంతస్తులో వంటగది, బాత్రూమ్ , డైనింగ్ హాల్ ఉన్నాయి. రెండవ అంతస్తులో, వాష్‌రూమ్, లైబ్రరీ , బెడ్‌రూమ్ ఉన్నాయి. మూడవ అంతస్తు పైకప్పుతో ఒకే గదితో ఉంటుంది. ఈ గాడి నుంచి చూస్తే చెట్టు అందమైన కొమ్మలను చూడవచ్చు. తన భార్య , కొడుకు, ఇలా తన ఫ్యామిలీ సభ్యుల జీవితం ఈ ఇంటిలో సంతోషంగా ఉందని చెప్పారు. తమకు ప్రతి వేసవిలో మామిడికాయలను  బహుమతిగా ఇస్తుందని 75 ఏళ్ల ప్రదీప్ సింగ్ సంతోషంగా చెప్పారు.

ఇప్పటికే ఈ ట్రీహౌస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. అనేక మంది పర్యాటకులు సందర్శిస్తారు. అజ్మీర్ లోని అందమైన కోటలు, రాజభవనాలతో పాటు, ఈ అద్భుతమైన ట్రీహౌస్‌ను కూడా తమ పర్యటనలో భాగంగా చేర్చుకుంటారు. ‘

Also Read:  నేడు దేశవ్యాప్తంగా 8వేల దిగువకు కరోనా కేసులు..పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి పై ఆందోళన