National Tourism Policy: భారత పర్యాటక రంగానికి కొత్త జవసత్వాలు.. మోదీ సర్కార్ కీలక విధాన నిర్ణయాలు..
PM Narendra Modi - National Tourism Policy: కరోనా మహమ్మారి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం కాస్త కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి
PM Narendra Modi – National Tourism Policy: కరోనా మహమ్మారి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం కాస్త కుదుటపడుతోంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీంతోపాటు కరోనా కారణంగా దెబ్బతిన ఉత్తరాది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు పొందిన వారు కరోనా సర్టిఫికెట్ లేకుండానే పర్యటించడానికి అనుమతులిచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన పర్యాట జాతీయ విధానం త్వరలో అమల్లోకి తీసుకొచ్చేందుకు విధివిధానాలను ఖారారు చేసింది. దీనిలో పోస్ట్ కోవిడ్ -19 ట్రావెలర్‌కు సరిపోయేలా నిర్దిష్ట నిబంధనలను, విధి విధానాలను మంత్రిత్వ శాఖ ఖారారు చేసింది. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టమైన సూచనలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మహమ్మారి తగ్గిన నేపథ్యంలో పర్యాటకంపై జాతీయ విధానం ముసాయిదాను మంత్రిత్వ శాఖ తయారు చేసిందని అధికారులు తెలిపారు. మహమ్మారి తగ్గిన తర్వాత ఇది సమీక్షలో ఉంటుందని అధికారులు ప్రకటించినా.. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పర్యాటక ముసాయిదాకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఈ డ్రాఫ్ట్ నేషనల్ టురిజం పాలసీ ముసాయిదాను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు పంపారు.
మహమ్మారి తర్వాత పర్యాటక రంగం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, కోవిడ్-యుగం, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఈ పర్యాటక ముసాయిదాను రూపొందించారు. దీంతోపాటు డిజిటలైజేషన్ విధివిధానాలతో సులభతర ప్రయాణం, పర్యాటకానికి అనుగుణంగా మార్పులు చేశారు. భారత్‌లో అంతర్జాతీయ టూరిజం మార్పును తీసుకొచ్చేందుకు ప్రాణాళికను రూపొందించారు. వృత్తి, నైపుణ్యాల అభివృద్ధి, అవకాశాల కల్పనకు సంబంధించిన టూరిజాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.
16 చాప్టర్లు..
ఈ కొత్త పర్యాటక ముసాయిదాలో మొత్తం 16 ఛాప్టర్‌లు ఉన్నాయి. వాటిలో క్లాజులు, సెక్షన్లను వివరిస్తూ ముసాయిదాలో స్పష్టంగా వెల్లడించారు. దీంతోపాటు ఈ పర్యాటక పాలసీలో 20 అంశాలపై విధి విధానాలను ఖరారు చేశారు. 16 చాప్టర్‌లల్లో మొదటగా జాతీయ టూరిజం పాలసీ పరిచయం గురించి వివరించారు. చాప్టర్ 2 -విజన్, మిషన్, లక్ష్యం చాప్టర్ 3 – నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ చాప్టర్ 4 – నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్ చాప్టర్ 5 – టూరిజం, హాస్పిటాలిటీ సెక్టార్ స్కిల్ మిషన్ అధ్యాయం 6 – DMOలపై జాతీయ మిషన్ అధ్యాయం 7 – పర్యాటక MSMEలపై జాతీయ మిషన్ చాప్టర్ 8 – వీసా, ఇమ్మిగ్రేషన్, కస్టమ్ ప్రాసెస్‌లు చాప్టర్ 9 – స్వాగతించే అంశాలు, సురక్షితం, శుభ్రత, పరిశుభ్రమైన గమ్యం అధ్యాయం 10 – అతుకులు లేని కనెక్టివిటీ, రవాణా మౌలిక సదుపాయాలు అధ్యాయం 11 – గమ్యం ప్రణాళిక, అభివృద్ధి అధ్యాయం 12 – పర్యాటక రంగంలో పెట్టుబడిని ప్రోత్సహించడం అధ్యాయం 13 – మార్కెటింగ్, ప్రమోషన్ అధ్యాయం 14 – నాణ్యత హామీ, ప్రమాణీకరణ అధ్యాయం 15 – పరిశోధన, అభివృద్ధి అధ్యాయం 16 – పాలన, సంస్థాగత అనుసంధానాలు, వాటాదారుల ఎంగేజ్‌మెంట్
విధి విధానలు.. కీలక అంశాలు..
విధివిధానాల్లో వారసత్వం-సంస్కృతి, ఆధ్యాత్మికం, యోగా, ఆయుర్వేదం, మెడికల్ టూరిజం, అగ్రి టూరిజం, బీచ్‌లు-ద్వీపాల టూరిజం, నదులు-డ్యాంలు, ఓడలు-సముద్రమార్గం, అడ్వేంచర్, ఈకో టూరిజం, స్పోర్ట్స్, గోల్ఫ్, వంటకాలు, షాపింగ్, పండుగలు-వేడుకలు, సినిమాటిక్ టూరిజం, డెస్టినేషన్ వెడ్డింగ్స్, సమావేశాలు, ప్రత్యేక కార్యక్రమాలు లాంటి వాటిపై స్పష్టమైన విధివిధానాలను ముసాయిదాలో వెల్లడించారు.
దీంతోపాటు ఈ ముసాయిదాలో పలు విషయాలను కూడా ప్రస్తావించారు. 1. టూరిజం ఎంటర్‌ప్రైజెస్ 2. సందర్శకులు 3. పర్యాటకులు 4. ఇన్‌బౌండ్ 5. అవుట్‌బౌండ్ 6. దేశీయ పర్యాటకం 7. ఐటీఏ 8. ఐటీఆర్ 9. గమ్యం 10. ఆకర్షణ 11. అక్రిడిటేషన్ లాంటి విషయాలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం ముసాయిదాలో స్పష్టంచేసింది.
Also Read: