AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CRPF: దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అన్న.. దగ్గరుండి చెల్లి పెళ్లి జరిపించిన తోటి జవాన్లు..

CRPF: దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అన్న.. దగ్గరుండి చెల్లి పెళ్లి జరిపించిన ఆర్మీ జవాన్లు.. ఓ చెల్లికి పెళ్లి నిశ్చయమైంది.. కానీ పేగు తెంచుకున్న అన్న లేడు.. వివాహ క్రతువు జరుగుతోంది.. అంతలోనే

CRPF: దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అన్న.. దగ్గరుండి చెల్లి పెళ్లి జరిపించిన తోటి జవాన్లు..
Jawan Sister Marriage
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Dec 16, 2021 | 2:41 PM

ఓ చెల్లికి పెళ్లి నిశ్చయమైంది.. కానీ పేగు తెంచుకున్న అన్న లేడు.. వివాహ క్రతువు జరుగుతోంది.. అంతలోనే జవాన్లంతా వచ్చారు. మేమున్నామని నవ వధువుకి భరోసానిచ్చారు. వివాహ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. అదేంటి..? సరిలేరు నీకెవ్వరు సీన్‌ అని అనుకుంటున్నారా? యస్.. అలాంటి దృశ్యమే.. రియల్‌ లైఫ్‌లో జరిగింది. అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో హీరో మహేశ్ బాబు.. తోటి సైనికుడు అమరుడు కావటంతో అతని చెల్లి పెళ్లిని దగ్గరుండి జరిపిస్తాడు. నిజజీవితంలో పుల్వామా దాడిలో అమరుడైన ఓ జవాను చెల్లెలి పెళ్లిని తోటి జవాన్లు దగ్గరుండి ఘనంగా జరిపించారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన శైలేంద్ర ప్రతాప్ సింగ్‌ దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో సైన్యంలో చేరాడు. దేశ సేవలో అమరుడయ్యాడు. ఈ క్రమంలో తన సోదరి పెళ్లి నిశ్చయమవడంతో శైలేంద్రతో పనిచేసిన సిబ్బందికి కుటుంబసభ్యులు పెళ్లి పత్రిక పంపించారు. సాధారణంగా ఆర్మీ.. పెళ్లి, ఫంక్షన్ల అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ ఓ వీరుడి చెల్లి పెళ్లికి ఎలాగానైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని 50 మందిని పంపించి .. వారింట్లో సంతోషం వెల్లివిరిసేలా చేసింది.

శైలేంద్ర ప్రతాప్‌ మంచి సైనికుడు. విధి నిర్వహణలో వెన్నుచూపని వీరుడు. ఉగ్రమూక దాడిలో వీరమరణం పొందారు. ఉగ్రవాదులతో జరిగిన భీకరపోరులో ఆసువులు బాసాడు. తోటి సైనికులను కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. దేశం కోసం కుమారుడిని కోల్పోయాం. కానీ ఆ దేవుడే మాకు మరో 50 మంది బిడ్డల్ని ఇచ్చారని శైలేంద్ర పేరెంట్స్ భావోద్వేగానికి లోనయ్యారు.

Read Also.. 50th Vijay Diwas: ఘనంగా విజయ్‌ దివస్‌.. అమరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..