Bigg boss 5 Telugu: కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించిన బిగ్ బాస్.. హౌస్‌లో విరబూసిన నవ్వులు

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో సీజన్ 5 ముగియనుంది. 19 మంది తో మొదలైన బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Bigg boss 5 Telugu: కంటెస్టెంట్స్‌ను ఆటపట్టించిన బిగ్ బాస్.. హౌస్‌లో విరబూసిన నవ్వులు
Biggboss 5 Telugu
Follow us

|

Updated on: Dec 16, 2021 | 9:43 PM

Bigg boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో సీజన్ 5 ముగియనుంది. 19 మంది తో మొదలైన బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ మధ్య గొడవలు,అల్లర్లు, ఏడుపులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 నుంచి ఒక్కక్కరుగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో ఐదుగురు హౌస్ మేట్స్ మిగిలారు.సిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ టాప్ 5లో నిలిచారు. ఇక వీరిలో ఒకరు బిగ్ బాస్ విన్నర్ అవ్వనున్నారు. ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టాప్ 5లో ఉన్న శ్రీరామ్.. మానస్.. షణ్ముఖ్.. సన్నీ.. సిరీల ఎమోషనల్ జర్నీ కార్యక్రమాలతో బిగ్ బాస్ చివరి వారం సాగుతుంది. ఇక చాలా కాలం తర్వాత ఈ ఐదుగురు కలిసి సరదాగా గేమ్స్ ఆడుకుంటూ సందడి చేస్తున్నారు.

తాజగా నేటి ఎపిసోడ్  సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో గతంలో ఇచ్చిన టాస్క్ లనే మళ్ళీ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లు సరదాగా సాగాయి. ముందుగా లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో లేబుల్ లేని టీషర్ట్స్ వేసుకొని స్విమింగ్ పూల్ లో ఈత కొట్టాలి. ఈ టాక్స్‌లో షణ్ముఖ్, మానస్ పాటిస్పెట్ చేశారు. ఆతర్వాత కొన్ని సాంగ్స్ ను ఒక సీక్వెన్స్ లో ప్లే చేశారు . ఆ పాటలను బోర్డ్స్ పై రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. సన్నీ ఫ్రాగ్ స్పెల్లింగ్ తప్పుగా రాసి బిగ్ బాస్ కు దొరికిపోయాడు. ఆతర్వాత సిరిని కప్పకు ఎలుకకు ఉన్న సంబంధం ఏంటి అని అని అడిగాడు బిగ్ బాస్, ఆలాగే షణ్ముఖ్ రాసిన వాటిలో చివరిగా ట్రాక్టర్ బ్రాకెట్లో సిరి అని రాసాడు. దాంతో బిగ్ బాస్ ఆన్సర్ ట్రాక్టరా..? లేక సిరి నా..? అని అడిగాడు. దాంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మొత్తానికి నేటి ఎపిసోడ్ చాలా సరదాగా సాగిందని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!