Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sheena Bora Case: షీనా బోరా మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. CBIకి ఇంద్రాణి సంచలన లేఖ

Indrani Mukerjea writes to CBI: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్‌ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి రాసిన లేఖ సంచలనం రేపింది.

Sheena Bora Case: షీనా బోరా మర్డర్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌.. CBIకి ఇంద్రాణి సంచలన లేఖ
Sheena Bora
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 16, 2021 | 3:52 PM

Sheena Bora Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా మర్డర్‌ కేసు అనూహ్య మలుపు తిరిగింది. షీనా బోరా చనిపోలేదని , బతికే ఉందంటూ ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సీబీఐకి లేఖ రాయడం సంచలనం రేపింది. కశ్మీర్‌లో ఉన్న షీనా బోరా ఆచూకీ కనిపెట్టాలని ఆమె సీబీఐని కోరింది. ఈ వ్యవహారంపై ఇంద్రాణీ ప్రత్యేక సీబీఐ కోర్టులో పిటిషన్‌ కూడా వేసిందని, త్వరలోనే న్యాయస్థానం విచారణ చేపట్టే అవకాశాలునట్టు తెలుస్తోంది.

థ్రిల్లర్‌ లాగా షీనా బోరా మర్డర్‌ మిస్టరీ కొనసాగింది. షీనా బోరా హత్య కేసులో అరెస్టయిన ఇంద్రాణీ 2015 నుంచి ముంబయిలోని బైకుల్లా జైలులో ఉంటోంది. జైల్లో ఓ మహిళా ఖైదీ తనను కలిసిందని, షీనాను ఆమె కశ్మీర్‌లో చూసినట్లు తనకు చెప్పిందని ఇంద్రాణీ సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. షీనా కోసం కశ్మీర్‌లో గాలించాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరినట్లు చెబుతున్నారు.

2012లో షీనా బోరా హత్య జరగ్గా.. మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో ఇంద్రాణీ ముఖర్జీ డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ అరెస్టయ్యాడు. అతడిని విచారిస్తున్న క్రమంలో.. 2012లో షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత్యచేశారని చెప్పాడు. అంతేగాక, ఇంద్రాణీ ఆమెను తన చెల్లిగా పరిచయం చేసినట్లు తెలిపాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ముమ్మరంగా దర్యాప్తు చేయగా షీనా.. ఇంద్రాణీ ముఖర్జీ కుమార్తేనని తేలింది.

Indrani Mukherjee

Indrani Mukherjee

ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను తన తల్లిదండ్రుల దగ్గర వదిలేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని వివాహం చేసుకుని అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జీని వివాహం చేసుకొంది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా.. ముంబయికి వెళ్లి ఇంద్రాణీని కలిసింది. అయితే, ఇంద్రాణీ మాత్రం షీనాను అందరికీ చెల్లిగా పరిచయం చేసింది.

ఈ క్రమంలోనే పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌ ముఖర్జీతో షీనాకు పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. అదే సమయంలో షీనా.. ఇంద్రాణీ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దీంతో షీనా తల్లిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ.. తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో షీనాను గొంతునులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది.

Also Read..

Omicron: కలవర పెడుతున్న ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు అధికం.. తాజా అధ్యయనంలో సంచలనాలు!

Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..

Pushpa The Rise : ‘పుష్ప’ స్టోరి వీరప్పన్ కథేనా..? చిత్రయూనిట్ ఏమంటున్నారంటే..