AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa The Rise : ‘పుష్ప’ స్టోరి వీరప్పన్ కథేనా..? చిత్రయూనిట్ ఏమంటున్నారంటే..

Pushpa Movie: ప్రజెంట్ దేశమంతా పుష్పరాజ్‌ మేనియాతో ఊగిపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీకి సందడి మామూలుగా లేదు.

Pushpa The Rise : 'పుష్ప' స్టోరి వీరప్పన్ కథేనా..?  చిత్రయూనిట్ ఏమంటున్నారంటే..
హిందీలో మూడు రోజులకు 12 కోట్లు వసూలు చేసిందని.. పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాము కానీ ఇంత పెద్ద రేంజ్‌లోకి వెళ్తుందని తాము అనుకోలేదు అని నిర్మాతలు తెలిపారు
Rajeev Rayala
|

Updated on: Dec 16, 2021 | 3:16 PM

Share

Pushpa Movie: ప్రజెంట్ దేశమంతా పుష్పరాజ్‌ మేనియాతో ఊగిపోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్‌ ఇండియా మూవీకి సందడి మామూలుగా లేదు. ప్రమోషన్స్‌ విషయంలోనూ బన్నీ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు. రోజుకు రెండు రాష్ట్రాలు చుట్టేస్తూ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు చిత్రయూనిట్. అయితే పుష్ప మూవీ కంటెంట్‌ గురించి సోషల్ మీడియాలో మాత్రం కొన్ని డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

పుష్ప కథ విషయంలో షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే క్లారిటీ ఇచ్చారు దర్శకుడు సుకుమార్‌. సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతుందని… బన్నీ మాస్‌ యాక్షన్‌ రోల్‌లో స్మగ్లర్ గా కనిపిస్తారని చెప్పారు. దీంతో బన్నీ క్యారెక్టర్‌ వీరప్పన్ ఇన్సిపిరేషన్‌తో డిజైన్‌ చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా సాండల్‌వుడ్‌గా పేరున్న కన్నడ ఇండస్ట్రీలో ఈ ప్రచారం కాస్త గట్టిగానే జరిగింది.

అందుకే కన్నడ ప్రమోషన్స్‌లోనే ఈ న్యూస్‌కు చెక్‌ పెట్టారు బన్నీ. రీసెంట్‌ బెంగళూరులో జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథకు వీరప్పన్‌ రియల్‌ లైఫ్‌ స్టోరికి అస్సలు సబంధం లేదు.. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్‌ స్టోరి అని చెప్పారు. కన్నడ అమ్మాయి రష్మిక హీరోయిన్‌గా కావటం.. సాండల్‌వుడ్‌ స్టార్‌ ధనుంజయ్‌ విలన్‌గా నటిస్తుండటంతో పుష్ప సినిమా మీద కర్ణాటకలో భారీ హైప్‌ క్రియేట్ అయ్యింది.

కోవిడ్ తరువాత రిలీజ్‌ అవుతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావటంతో పుష్ప సక్సెస్ కోసం ఇండస్ట్రీ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. సంక్రాంతి సీజన్‌కు జోష్ రావాలంటే పుష్ప రికార్డ్ వసూళ్లు సాధించాలి. మాస్ యాక్షన్ సినిమా కావటంతో థియేటర్లకు రిపీట్‌ ఆడియన్స్‌ను రప్పించే సత్తా పుష్పరాజ్‌కు ఉంటుందని ఇండస్ట్రీ జనాలు గట్టిగా నమ్ముతున్నారు.. కంటెంట్‌ పరంగా కూడా పుష్ప సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తుండటంతో రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఐకాన్‌ స్టార్ ఆర్మీ. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసి సినిమా పై భారీ బజ్ ను క్రియేట్ చేశాయి ఇక రేపు ( డిసెంబర్ 17న) థియేటర్స్ దగ్గర జాతర చేయడానికి బన్నీ ఆర్మీ సిద్ధం అయ్యారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa: The Rise : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టారా..! సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.. యూఏఈ నుంచి పుష్ప ఫస్ట్ రివ్యూ..

Pushpa Movie: బన్నీ సాహసాన్ని మెచ్చుకుంటున్న సినీ విశ్లేషకులు.. పుష్పరాజ్‌‌కు పాత్రను న్యాయం చేశాడంటూ..!!

మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..