AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..

తిరుచానూరులో అమరావతి రైతులు సభ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకాబోతున్నారు.

Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..
Tdp Chief Chandrababu
Sanjay Kasula
|

Updated on: Dec 16, 2021 | 3:09 PM

Share

Amravati Farmers – Chandrababu: మరోసారి ఉద్యమం ఊపందుకుంటోంది. రాజధాని నినాదం గర్జిస్తోంది. అమరావతినే రాజధాని కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర నిర్వహించిన రైతులు రేపు చిత్తూరు జిల్లా తిరుచానూరులో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలుచేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి రాయలసీమ విద్యార్థి సంఘాలు. ఈ క్రమంలో ఇవాళ కర్నూలు సమావేశం ఏర్పాటు చేశాయి. మరోవైపు అసలు రాజధానిపై రాజకీయ పార్టీల స్టాండ్ ఏంటి? అంటూ రాయలసీమ చైతన్య సభకు ఏర్పాట్లు చేస్తోంది రాయలసీమ మేధావుల ఫోరం. సింగిల్‌ కేపిటల్ వర్సెస్ 3 రాజధానులు వికేంద్రీకరణపై పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతోంది.

శుక్రవారం చిత్తూరు జిల్లా తిరుచానూరులో అమరావతి రైతులు సభ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకాబోతున్నారు. చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రవణ్ కుమార్‌తోపాటు మరికొందరు నేతలు హాజరవుతున్నారు.

ఇదిలావుంటే ఎల్లుండి తిరుపతిలో నిర్వహించనున్న రాయలసీమ చైతన్య సభకు రాయలసీమ మేధావుల ఫోరం సన్నాహక ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ సభను విజయవంతం చేయాలంటూ భారీ ప్రదర్శన చేపట్టారు. ఒకవైపు అమరావతి రాజధాని కోసం రైతుల బహిరంగ సభ, మరోవైపు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, జరగాల్సిన అభివృద్ధిపై చైతన్య సభ. ఇవన్నీ పోలీసులకు చాలెంజింగ్‌గా మారాయి.

అది రైతుల సభ కాదు రాజకీయ సభ.. – మంత్రి బొత్స సత్యనారాయణ

అయితే ఇది శుక్రవారం తిరుపతిలో జరిగేది రైతుల సభ కాదు.. రాజకీయ సభ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. తిరుపతి సభలో వైసీపీ అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తోందన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. విజయవాడ నుంచి తిరుపతి వరకు జరిగిన పాదయాత్రలో టీడీపీ వాళ్ళు మినహా ఎవరైనా స్వచ్చందంగా వచ్చారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అజెండా ప్రకారం ఆ 29 గ్రామాలు వారి సమాజికవర్గాన్ని అభివృద్ధి చేయడమే అని అన్నారు.

రాజధాని రైతులది మాత్రమే త్యాగం అని చంద్రబాబు అంటున్నారు.. మరీ నాగార్జున సాగర్, పోలవరం కట్టడానికి వేల మంది రైతులు భూములు ఇచ్చారు.. వారిది త్యాగం కాదా? అని ప్రశ్నించారు. తాము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. చంద్రబాబుకి ఒక అజెండా అని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్ వద్దని అచ్చం నాయుడుకి ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం.. జాతి సంపాదని దోచుకుంటు త్యాగం అంటున్నారని.. అదే అమరావతిలో అవినీతి జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. రాజకీయ ఉద్దేశాల తో బీజేపీ వాళ్ళు స్టాండ్ మార్చుకున్నారు. ఇక జనసేన పగలు ఎవరితో ఉంటుందో రాత్రి ఎవరితో ఉంటుందో తెలిసిందే కదా మంత్రి బొత్స ఎద్దేవ చేశారు.

శుక్రవారం సభకు అఖిలపక్ష పార్టీలు హాజరవుతాయని అంటున్నారు రైతు సంఘాలు. ఇందులో 50 వేల మంది హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు రైతు సంఘాలు.

ఇవి కూడా చదవండి: Aadhaar-Voter ID Link: బోగస్‌ ఓట్ల ఏరివేతకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఓటర్‌ ఐడీతో ఆధార్‌ నెంబర్‌ లింక్‌!

Tirumala: శ్రీవారి సేవలో బాలయ్య, బోయపాటి.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ