ఒకే కుటుంబంలో వరుస మరణాలు.. రోజుల వ్యవధిలో దంపతుల మరణం.. తట్టుకోలేక అమ్మ, తమ్ముడు మృతి.. అనాథులైన చిన్నారులు!
ఒకే కుటుంబంలో నలుగురు వరుసమరణాలు కలకలం సృష్టించాయి. వరుస మరణాలతో ఆ ఇంటి చిన్నారులు అనాథలుగా మారారు. శోకసంద్రంగా మారిన ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడంలేదు.
Series of Deaths in Same Family: ఒకే కుటుంబంలో నలుగురు వరుసమరణాలు కలకలం సృష్టించాయి. వరుస మరణాలతో ఆ ఇంటి చిన్నారులు అనాథలుగా మారారు. శోకసంద్రంగా మారిన ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడంలేదు. ఈ హృదయవిదాకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యు.కొత్తపల్లి మండలం కొత్త మూలపేట గ్రామం కొల్లవారి పాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. గత నేల 25వ తేదిన నేలపాటీ నాని అనే వివాహితుడు అకస్మాత్తుగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పచ్చ కామెర్ల కారణంగా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
భర్త చనిపోయినా పదిహేను రోజులకు అనగా ఈ నేల 11వ తేదీన అతని భార్య కుమారి కూడా తీవ్రమైన కడుపునోప్పితో బాధపడుతూ మృతి చెందారు. ఇద్దరి మరణ వార్తలు తట్టుకోలేక అదేరోజున నేలపాటి నాని అమ్మమ్మ కొల్లా సింహాచలం గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. అనంతరం మూడో రోజున 14వ తేదిన కొల్లా సింహాచలం కుమారుడు కొల్లా శ్రీను తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ఇతను డెంగ్యూతో మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ వరుస మరణాలతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొడుకు, కోడలిని, అమ్మను, తమ్ముడి ని పోగొట్టుకుని అనాథగా మిగిలామంటూ సింహాచలం పెద్దకుమార్తె నేలపాటి అప్పలకొండ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ వరుస మరణాల వార్త విన్న హృదయాలు కలచివేస్తూంది. మరోవైపు, గ్రామస్తులు ఈ మరణాలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజంగా అదే అనారోగ్యలతో మృతి చెందారా లేక కరోనా లక్షణాలా అంటు గ్రామంలో భయబ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్‌లో పని నిమిత్తం వెళ్లి మేనల్లుడు నేలపాటి నాని మృత్యువార్త విని చూడటానికి వచ్చిన సింహాచలం కుమారుడు కొల్లా నాని అనే యువకుడు మృత్యు ఒడికి చేరుకోవడంతో మిగిలిన కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముందుగా చనిపోయిన భార్యాభర్తలు నేల పాటి నాని, కుమారికి పుట్టిన మూడు సంవత్సరాల బాలుడు ఇప్పుడు అనాథగా మారాడు. అంతేకాకుండా కొల్లా శ్రీను, తల్లి సింహాచలం కూడా మృతిచెందటంతో సింహాచలం చెందిన సంతానం ముగ్గురు కూమార్తేలు అనాథలుగా మారారు. అందులో ఇద్దరు కుమార్తెలు వికలాంగులు కూడా కావటంతో వీరు ఒంటరిగా మిగిలి పోయారు. వీరిని ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి మొదటగా కరోనా నిర్ధారణ పరీక్షలు గాని ఇతర పరిక్షలు చేస్తే మరిన్ని కారణాలు తెలుస్తాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఒకే కుటుంబంలో వరుస మరణాలపై వైద్య అధికారులు కానీ ఇతర అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు.
Read Also.. Covid Omicron: హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ కేసులతో అధికారుల అలర్ట్.. కంటైన్మెంట్ జోన్‌గా టోలిచౌకీ!