Tirumala: శ్రీవారి సేవలో బాలయ్య, బోయపాటి.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ

Tirumala-Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏపీలోని..

Tirumala: శ్రీవారి సేవలో బాలయ్య, బోయపాటి.. అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ
Balarkishna Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Dec 16, 2021 | 10:42 AM

Tirumala-Akhanda Movie: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏపీలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటుంది. తాజాగా శ్రీవారిని నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి, నిర్మాత రవీందర్ రెడ్డి సహా చిత్ర యూనిట్ తిరుమల  ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకున్నారు. పురోహితులు బాలయ్య, బోయపాటిలను ఆశీర్వదించారు.

స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల బాలకృష్ణ మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు ధైర్యం ఇచ్చేలా అఖండ విజయం సాధించిందని చెప్పారు. కరోనా నేపథ్యంలో అఖండ సినిమాతో ఇండస్ట్రీకి ప్రేక్షకులు ఊపిరిపోశారన్న బాలకృష్ణ చెప్పారు. ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చింది. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అఖండ చిత్రానికి విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు పాతరోజులు గుర్తు తెచ్చేలా మళ్ళీ అఖండ సినిమాకి జనం రావడం .. సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఇదే సందర్భంలో రాజమౌళితో మీ సినిమా ఎప్పుడు అని మీడియా అడిగిన ప్రశ్నకు బాలయ్య మౌనం దాల్చారు.

Also Read :  బ్రిటన్‌లో ఒమిక్రాన్ కల్లోలం.. అత్యధికంగా రోజువారీ కేసులు నమోదు.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిచేసిన ప్రభుత్వం..