AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: భాగ్యనగర్ వాసుల కోసం IRCTC గొప్ప ప్యాకేజీ.. కాశీ నుండి నైమిశారణ్య వరకు తక్కువ ధరలో చుట్టేయండి..

ఆర్థికంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ టూర్ ప్యాకేజీ 'గంగా రామాయణ యాత్ర'ని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు .. 6 పగళ్లు ఉంటుంది. ఏప్రిల్ 11, 2023న హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో వారణాసి (కాశీ), ప్రయాగ్‌రాజ్, సారనాథ్, నైమిశారణ్య వంటి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు.

IRCTC Tour: భాగ్యనగర్ వాసుల కోసం IRCTC గొప్ప ప్యాకేజీ.. కాశీ నుండి నైమిశారణ్య వరకు తక్కువ ధరలో చుట్టేయండి..
Ganga Ramayan Yatra
Surya Kala
|

Updated on: Mar 12, 2023 | 7:19 PM

Share

ఆధ్యాత్మిక క్షేత్రాలను ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. ప్రముఖ పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిని సందర్శించాలనుకునే వారికి IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. చాలా విలాసవంతమైన, ఆర్థికంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ టూర్ ప్యాకేజీ ‘గంగా రామాయణ యాత్ర‘ని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు .. 6 పగళ్లు ఉంటుంది. ఏప్రిల్ 11, 2023న హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రయాణంలో వారణాసి (కాశీ), ప్రయాగ్‌రాజ్, సారనాథ్, నైమిశారణ్య వంటి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు.

IRCTC తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ రైలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్యాకేజీలో భాగంగా  ఆహారం, పానీయాలు బస వంటి సౌకర్యాలను అందిస్తోంది. IRCTC టూర్ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందించనున్నది. ఈ టూర్ ప్యాకేజీ రూ.28,200 నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఇందులో విమాన టిక్కెట్లు, బస్ సర్వీస్, హోటల్, ఆహారం, ప్రయాణ భీమా మొదలైనవి అందిస్తోంది.

టూర్ ప్యాకేజీ ధరలు.. 

ఇవి కూడా చదవండి

ప్రయాణీకుల ఎంపిక ఆధారంగా టూర్ ప్యాకేజీలకు టారిఫ్ మారుతూ ఉంటుంది. ధర ప్రయాణీకుడు ఎంచుకున్న ఆక్యుపెన్సీని బట్టి ఉంటుంది. మీరు మీ కోసం ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాశీ యాత్రకు వెళ్లాలనుకుంటే.. టూర్ ప్యాకేజీ ధరలు తెలుసుకోండి..

ఒకొక్కరికి రూ. 36,850 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇద్దరు వ్యక్తుల కోసం బుక్ చేయవలసి వస్తే ..  మీరు ఒక్కొక్కరికి రూ. 29,900 ఖర్చు చేయాలి.

ముగ్గురికి ఈ టూర్ ప్యాకేజీని ఎంచుకోవాల్సి వస్తే.. ఒక్కో వ్యక్తికి రూ.28,200 అవుతుంది. అదే సమయంలో, పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ ప్యాకేజీ కింద వారణాసిని సందర్శించాలనుకుంటే.. IRCTC అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు.

టూర్ ప్యాకేజీ ముఖ్యాంశాలు 

ప్యాకేజీ పేరు : గంగా రామాయణ యాత్ర (SHA10)

చూడాల్సిన ప్రదేశాలు : వారణాసి, ప్రయాగ్‌రాజ్, సారనాథ్ , నైమిశారణ్య

పర్యటన వ్యవధి కాలం:  5 రాత్రులు , 6 రోజులు

పర్యటన మొదలయ్యే రోజు : ఏప్రిల్ 11, 2023

భోజన సదుపాయాలు : అల్పాహారం, లంచ్ ,  డిన్నర్

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..