Tulip Garden: సమ్మర్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నారా.. మీ కోసం తులిప్ గార్డెన్ తెరుచుకుంటుందోచ్..

శ్రీనగర్‌లో తులిప్‌గార్డెన్‌ తెరుచుకోనుంది. ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శించేందుకు రెడీ ఉన్నాయి. ప్రతియేటా పుష్పాలు వికసించే సీజన్‌లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్‌ను తెరుస్తుంటారు.

Tulip Garden: సమ్మర్ ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నారా.. మీ కోసం తులిప్ గార్డెన్ తెరుచుకుంటుందోచ్..
Tulip Garden
Follow us

|

Updated on: Mar 12, 2023 | 8:27 PM

జమ్ముకశ్మీర్‌లో రంగురంగుల పువ్వులు టూరిస్టులను ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఎరుపు, తెలుపు రంగుల్లో తులిప్ పుష్పాలు సందర్శకులను ఆకర్శిస్తున్నాయి. ప్రతియేటా వసంత రుతువులో తులిప్ పుష్పాలు వికసించే సమయంలో..ఈ గార్డెన్‌ను పర్యాటకుల కోసం అధికారులు తెరుస్తుంటారు. ఈ పూల వనంలో ఐదు రంగుల్లో తులిప్‌ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్‌ పూలతోపాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్‌ గార్డెన్‌కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. వచ్చే వారం పర్యాటకులను తెరవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తులిప్ గార్డెన్ ఇన్‌ఛార్జ్ ఇనామ్ ఉల్ రెహ్మాన్ తెలిపారు.

సిరాజ్ బాగ్ అని కూడా పిలువబడే ఈ పార్క్ మార్చి 19 నుండి ప్రజలకు తెరిచి ఉంటుంది. వివిధ రంగుల 1.5 మిలియన్ తులిప్‌లతో పాటు, ఇతర వసంత పువ్వులలో హైసింత్‌లు, డాఫోడిల్స్, మస్కారి మరియు సైక్లామెన్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఫౌంటెన్ ఛానెల్‌ని ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యానవన వృత్తి నైపుణ్యానికి ఉదాహరణగా నిలుస్తుందని రెహమాన్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్‌ పూల గార్డెన్‌లు ఉన్నాయి. అయితే శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. ఈ గార్డెన్‌ విస్తీర్ణం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 హెక్టార్‌లు ఉంది. ప్రతి ఏటా వసంత రుతువులో పుష్పాలు వికసిస్తుంటే ఈ గార్డెన్‌ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది తులిప్ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులిప్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. అంటే ఈ 20 రోజులపాటు రంగురంగుల తులిప్‌ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

తొలిరోజు తులిప్‌ పూల అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఆ పూల సోయగాలు సందర్శకుల మదిని దోచేస్తున్నాయి. ఐదు రంగుల్లో వికసించిన పూలు టూరిస్టులను మెస్మరైజ్‌ చేస్తున్నాయి. మంచు కొండల మధ్య తులిప్‌ పూల సోయగాలను వీక్షిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

మరిన్ని టూరిజం వార్తల కోసం