IRCTC Tour Package: తక్కువ ఖర్చుతో గుజరాత్ లోని పసిద్ధ ప్రాంతాలు చుట్టి వచ్చేసే సూపర్ ఛాన్స్.. వివరాలివే!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేక రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.

IRCTC Tour Package: తక్కువ ఖర్చుతో గుజరాత్ లోని పసిద్ధ ప్రాంతాలు చుట్టి వచ్చేసే సూపర్ ఛాన్స్.. వివరాలివే!
Irctc Gujarat Tour Package
Follow us
KVD Varma

|

Updated on: Dec 04, 2021 | 5:31 PM

IRCTC Tour Package: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అనేక రాష్ట్రాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా కొత్త సంవత్సరంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే.. మీకు ఐఆర్సీటీసీ ద్వారా చాలా చౌకైన టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో ఒకటి ఐఆర్సీటీసీ(IRCTC) అందిస్తున్న గుజరాత్ టూర్ ప్యాకేజీ ఒకటి.

ఈ పర్యటనలో అనేక అందమైన ప్రదేశాలను సందర్శించేందుకు ఐఆర్సీటీసీ(IRCTC) తన ప్రయాణీకులకు అవకాశం కల్పిస్తుంది. ఇందులో మీరు అహ్మదాబాద్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, గిర్ వన్, డయ్యూ, సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, రాజ్‌కోట్‌లను చూసే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీల్లో అత్యంత సరసమైన టూర్ ప్యాకేజీలలో ఇది ఒకటి. అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించడం ద్వారా టూరిస్ట్ ప్యాకేజీలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

అయితే, ఈ ప్యాకేజీ కోల్ కతా నుంచి ప్రారంభం అవుతుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ప్యాకేజీకి అనుకూలంగా కోల్ కతాకు ప్రయాణించాల్సి ఉంటుది. తక్కువ ఖర్చుతో దాదాపు గుజరాత్ లోని అన్ని ప్రదేశాలూ చూసే అవకాశం ఉన్నందువల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు కోల్ కతా నుంచి వెళ్ళినా ఉపయోగకరంగానే ఉంటుంది.

ప్యాకేజీ పేరు- స్వాగత్-ఇ గుజరాత్

డెస్టినేషన్ కవర్- అహ్మదాబాద్-స్టాట్యూ ఆఫ్ యూనిటీ-గిర్ వన్-డయ్యు-సోమ్‌నాథ్-ద్వారక-నాగేశ్వర్-రాజ్‌కోట్

ట్రావెలింగ్ మోడ్ – ఫ్లైట్

ప్రయాణం- 28.01.2022

ప్రయాణ వ్యవధి – 6 రాత్రులు/7 రోజులు

విమాన వివరాలు 1. ఫ్లైట్ నంబర్ (6E 245) 28.01.2022న 5.35కి కోల్‌కతాలో బయలుదేరి 8.00 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది.

2. తిరిగి వచ్చే విమానం నంబర్ (6E 6556) 03.02.2022న 21.45కి అహ్మదాబాద్‌లో బయలుదేరి 00.05కి కోల్‌కతా చేరుకుంటుంది.

IRCTC ట్వీట్ ద్వారా ప్యాకేజీని షేర్ చేసింది

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన అధికారిక ట్విట్టర్ ఖాతాతో ఈ ప్యాకేజీ సమాచారాన్ని పంచుకుంది. దీనితో పాటు, పూర్తి టూర్ ప్యాకేజీ, డెస్టినేషన్ సర్క్యూట్, ధర గురించి సమాచారం కూడా ఇందులో అందించారు. ఇది కాకుండా, ఈ ట్వీట్‌లో  లింక్ ఇచ్చారు. దానికోసం నేరుగా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ పర్యటనకు సంబంధించిన ఏదైనా సమాచారం కోసం, మీరు ఈ నంబర్‌కు 9002040020, 9002040126కు కాల్ చేయవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీ చార్జీలు ఇలా ఉన్నాయి..

సింగిల్ షేరింగ్ – 39975/- డబుల్ షేరింగ్ – 30075/- ట్రిపుల్ షేరింగ్ – 28775/- చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) – 25065/- బెడ్ అవసరం లేని చైల్డ్ (2-4 సంవత్సరాలు) – 22155/-

టూర్ సాగుతుంది ఇలా..

1. 1వ రోజు: కోల్‌కతా-అహ్మదాబాద్

ఇస్కాన్ ఆలయం మరియు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, సాయంత్రం అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించండి. ఇందులో సాయంత్రం అక్కడే బస చేసే సౌకర్యం.

2. 2వ రోజు: అహ్మదాబాద్ – స్టాట్యూ ఆఫ్ యూనిటీ

3. 3వ రోజు – అహ్మదాబాద్-జునాగర్-సాసన్ గిర్

4. 4వ రోజు: ససన్ గిర్-డయ్యూ-సోమ్‌నాథ్

ఇక్కడ ఎవరైనా తన స్వంత ఖర్చుతో ససన్ గిర్ లయన్ సఫారీకి వెళ్ళవచ్చు. అయితే, సఫారీ తర్వాత, డయ్యూ (డయ్యూ ఫోర్ట్, డయ్యూ మ్యూజియం, సెయింట్ పాల్స్ చర్చి) ద్వారా సోమనాథ్‌ని సందర్శించవచ్చు.

5. రోజు 5 – సోమనాథ్-పోర్బందర్-ద్వారక

ప్రసిద్ధ సోమనాథ దేవాలయం, బాల్క తీర్థం, గీతా మందిర్ సందర్శనతో ప్రారంభించి, పోర్ బందర్ (సుదామ దేవాలయం మరియు కీర్తి మందిరం) మీదుగా ద్వారకకు వెళతారు.

6. రోజు 6 – ద్వారక-రాజ్‌కోట్

ద్వారకా (ద్వారకా ఆలయం, నాగేశ్వరాలయం) సందర్శనా తర్వాత రోజు అక్కడ ఉండడానికి సౌకర్యం

7. 7వ రోజు – రాజ్‌కోట్-అహ్మదాబాద్-కోల్‌కతా

సరిగ్గా 06:00 గంటలకు హోటల్ నుండి చెక్-అవుట్ ద్వారా అహ్మదాబాద్‌కు బయలుదేరుతారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కోల్‌కతాకు తిరిగి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి: Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..

Cryptocurrency: భారీ క్రిప్టోకరెన్సీ చోరీ.. సైబర్ దాడితో హ్యాకర్లు చేసిన పని.. ఎన్ని క్రిప్టో టోకెన్‌లను దొంగిలించారంటే..

Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం