IRCTC Hampi Tour: హైదరాబాద్ నుంచి హంపీ టూర్ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. మరిన్ని వివరాల కోసం..
IRCTC Hampi Tour: కరోనా వైరస్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగ సంస్థలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు..
IRCTC Hampi Tour: కరోనా వైరస్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగ సంస్థలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఉన్న టూర్లతో పాటు కొత్త టూర్లను ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ టూరిజం తాజాగా హెరిటేజ్ హంపి పేరుతో హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఆగష్టు 19 న ప్రారంభం కానున్న ఈ టూర్ లో బళ్లారి, హోస్ పేట్ , హంపి, బాదామి లను కూడా చూడవచ్చు. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు ఉన్న టూర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే.. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను దర్శించాల్సి ఉంది.
ఆగష్టు 19 టూర్ మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మొదలవుతుంది. ఇక్కడ ఉదయం 8 గంటలకు ప్లైట్ ఎక్కితే బళ్లారి ఎయిర్ పోర్ట్ లో 9. 30 నిమిషాలకు దిగుతారు. అక్కడన్నచి హోస్ పెట్ కు వెళ్లి.. హోటల్ లో బస చేయాల్సి ఉంటుంది. అదే రోజు అనెగుడి, పంపసరోవరాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఇక సాయంత్రం తుంగభద్ర డ్యామ్ సందర్శించొచ్చు. ఆ రోజు రాత్రికి హోస్ పెట్ లో బాసా చేయాలి..
రెండో రోజు హంపీ లోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించవచ్చు. హంపీలోని విఠ్ఠల ఆలయం, విరూపాక్ష ఆలయం, క్వీన్స్ బాత్, ఎలిఫెంట్ స్టేబుల్, లోటస్ మహల్, హనుమాన్ విగ్రహం వంటి అనేక సందర్శనీయ ప్రాంతాలను చూడవచ్చు.. రాత్రికి మళ్ళీ తిరిగి హోస్ పేట్ లోని బస చేసిన హోటల్ కు చేరుకోవాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం బాదామి కి బయలుదేరాలి. అక్కడ బాదామి గుహలు, ఐహోల్ ఆలయం, పట్టడక్కల్ కట్టడాలు వంటివి దర్శనీయ ప్రాంతాలను, కట్టడాలను, ఆలయాలను దర్శించవచ్చు. తిరిగి రాత్రికి హోస్ పేట్ కు చేరుకొవాలి.
నాలుగో రోజు ఉద్యమ టిఫిన్ తిన్న అనంతరం బళ్లారిలోని విద్యానగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని సాయంత్రం 5.15 గంటలకు ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్ కు సాయంత్రం 6.20 గంటలకు చేరుకోవచ్చు. దీంతో హెరిటేజ్ హంపి టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధర ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 15,350. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.15,970, సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ.18,010.గా నిర్ణయించారు.
Also Read: మరోసారి మంచిమనసు చాటుకున్న సచిన్.. పేద రైతు కూతురు డాక్టర్ చదవడానికి అండగా..