Aloe Vera Benefits: వర్షా కాలంలో కలబంద తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. మీకు తెలుసా?
వర్షా కాలంలో కలబందను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా.. కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన మొక్క. ఇది చర్య సమస్యలను పరిష్కరించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా వర్షా కాలంలో ఎక్కువగా వచ్చే చుండ్రు, కడుపు నొప్పి, జలుబు వంటి సమస్యల నుండి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది.

అలోవెరా అనేది ఇసుక, పొడి, వేడి ప్రాంతాలలో ఎక్కువగా పెరిగే మొక్క. దాని ప్రత్యేకమైన నిర్మాణం, పదునైన ముళ్ళ కారణంగా దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఈ రోజుల్లో, ఫాస్ట్ లైఫ్, మన జీవనశైలి వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు ,సిగరెట్, మద్యం అలవాట్లతో చాలా మంది ఆరోగ్యాన్ని పాడు చేసుకొని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తీరా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను అన్నింటిని సరిచేయగల ఔషధం ఒకటి ఉంది. అదే అలోవెరా. ఈ అలోవెరా మనకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
అలోవెరా వల్ల కలిగే ప్రయోజనాలు..
కలబంద ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉంటాయి, దీన్ని తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ మన చర్మాన్ని తేమగా చేస్తాయి. అంతే కాకుండా ఇది మంటను తగ్గించడంతో పాటు ముఖంపై మొటిమల రాకుండా కాపాడుతోంది. కలబందలో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కలబంద రసం మన జీవక్రియను మెరుగు పరచడంతో పాటు, బరువును నియంత్రణలో ఉంచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా ఇది మన రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా సమతుల్యం చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కలబంద మొక్క మిగతా మొక్కల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది రాత్రి పూట కూడా ఆక్సీజన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి ఈ మొక్కను మనం బెడ్‌రూమ్‌లో పెట్టుకోవడం మంచింది.
వర్షాకాలంలో కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు
వర్షా కాలంలో ఎక్కవ తేమ కారణంగా మనకు జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు కలబంద జెల్‌ను కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే జుట్టు బలపడడంతో పాటు, చుండ్రు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది తలకు పోషణను అందించడంతో పాటు జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే జనాలు జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి అనారోగ్యం సమస్యలను ఎదుర్కొంటారు. కలబందను తీసుకోవడం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో చల్లదనాన్ని కాపాడడంతో పాటు కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో, దీనిని సహజ రోగనిరోధక శక్తిని పెంచేదిగా పరిగణిస్తారు.
గమనిక: కలబందను తీసుకునే ముందు మీరు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి, ముఖ్యంగా మీకు అలెర్జీ, అనారోగ్యం సమస్యలు ఉన్నప్పుడు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




