‘టీ’ ఎక్కడ పుట్టిందో తెలుసా..? రకరకాల టీలు ఇవే..!

'టీ' ఎక్కడ పుట్టిందో తెలుసా..? రకరకాల టీలు ఇవే..!

పొద్దున్నే కప్పు టీ, కాఫీ తాగకపోతే.. మనసంతా ఏదోలా ఉంది అంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతూంటారు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. కొంతమంది అయితే.. మార్నిగ్ టీ తాగనిదే.. బెడ్ కూడా దిగరు. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. ఇతర దేశాలన్నీ.. మన దేశంతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా మనదేశంలో.. టీకి ఉండే ప్రాముఖ్యతే వేరు. ఏ సందర్భమైనా.. టీ, కాఫీలు ఉండాల్సిందే. అతిథిలకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 21, 2019 | 12:15 PM

పొద్దున్నే కప్పు టీ, కాఫీ తాగకపోతే.. మనసంతా ఏదోలా ఉంది అంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీలు తాగని వారుండరు. దేశంలో 90 శాతం మంది టీ, కాఫీలని తాగుతూంటారు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. కొంతమంది అయితే.. మార్నిగ్ టీ తాగనిదే.. బెడ్ కూడా దిగరు. టీకి ఎంతగా ప్రాముఖ్యత ఉందంటే.. ఇతర దేశాలన్నీ.. మన దేశంతో డీల్స్ కుదుర్చుకున్నాయి. ముఖ్యంగా మనదేశంలో.. టీకి ఉండే ప్రాముఖ్యతే వేరు. ఏ సందర్భమైనా.. టీ, కాఫీలు ఉండాల్సిందే. అతిథిలకు ముందుగా.. ఇచ్చేది కూడా టీనే. అసోం, డార్జిలింగ్‌లో టీ తోటలకు చాలా ప్రత్యేకత ఉంది. రోజూ టీ తాగుతున్నాం.. కానీ.. ఇంతకీ ఈ టీ ఎక్కడ.. ఎలా.. పుట్టిందో మీకు తెలుసా..! ఈరోజు టీ నేషనల్ డే కాబట్టి టీ గురించి పలు ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం..!

 • చరిత్ర ప్రకారం.. టీని క్రీస్తుపూర్వం మొదటిసారిగా 2737లో చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు. ఆయన తాగే వేడి గిన్నెలో టీ తేయాకు పడిందట.. దాని నుంచి వచ్చిన టేస్ట్ ఆయనకు నచ్చడంతో.. మొదట బ్లాక్ టీ పుట్టుకొచ్చింది.
 • ఆ తరువాత టీని.. మనం తాగే విధంగా తయారు చేయడానికి 3 సంవత్సరాలు పట్టింది.
 • అలాగే.. శతాబ్దాలుగా.. టీని ఔషధంగా వాడుతూ వచ్చేవారు. టీని తాగడానికే కాకుండా.. వివిధ రకాల మందులో విరివిగా ఉపయోగించేవారు.
 • టీ తేయాకు బట్టి.. సమయానుకూలంగా.. ఏ విధంగా కోశారు.. ఏ విధంగా ఎండబెట్టారు అనేదాన్ని బట్టి మనకు.. గ్రీన్, బ్లాక్, వైట్, ఊలాంగ్ టీలు వచ్చాయి.
 • ఒకే మొక్క నుంచి రకరకాల టీలను తయారు చేసుకోవచ్చు
 • ఇక 1980లలో అమెరికాలో మొదటిగా టీ బ్యాగుల వాడకం మొదలైంది. వ్యాపారం నిమిత్తం.. అక్కడివారికి టీని టేస్ట్ చేయడానికి టీ పొడిని చిన్న బ్యాగుల్లో వేసి ఇచ్చారు.
 • ఇంకొక ఆసక్తికర విషయమైమిటంటే.. 18వ శతాబ్దం నుంచీ రెండో ప్రపంచ యుద్ధం వరకూ అమెరికాలో గ్రీన్ టీ ఫేమస్.
 • 1904లో వర్జీనియాలో ఐస్‌టీని కనిపెట్టారు. కొన్ని ఐస్‌ ముక్కలపై టీని పోసి తాగేవారు.
 • తైవాన్‌లో 1980 నుంచీ బబుల్ టీ అంటే బుడగల టీ వాడకంలో ఉంది. చిక్కటి టీని గిలక్కొట్టి ఇస్తారు.
 • కొరియా, చైనాలో ‘క్రిసాంతెమమ్’ అనే హెర్బల్ టీని బాగా తాగుతారు. అది జ్వరం, తలనొప్పికి చెక్ పెడుతుంది.
 • ఇక టిబెట్‌లో వెన్న టీ బాగా ఫేమస్. దీన్ని బ్లాక్ టీ, యాక్ బటర్, ఉప్పు కలిపి తయారు చేస్తారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu