AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యానికిది అమృతఫలం.. బెన్ఫిట్స్‌ అన్నీ ఇన్నీ కావు…

పండ్లలో అందరికీ ఎప్పటికీ లభించేది,.. సామాన్యులు సైతం కొనుగోలు చెయ్యగల పండు అరటి పండు. ఇది అన్నివయసుల వారకీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత ఫలం. ఒక్క అరటి పండు తింటే 3 యాపిల్‌ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్డు తిన్నట్లే అంటారు. ఈ పండులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసరం. అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది […]

ఆరోగ్యానికిది అమృతఫలం.. బెన్ఫిట్స్‌ అన్నీ ఇన్నీ కావు...
Pardhasaradhi Peri
|

Updated on: Sep 20, 2019 | 6:15 PM

Share

పండ్లలో అందరికీ ఎప్పటికీ లభించేది,.. సామాన్యులు సైతం కొనుగోలు చెయ్యగల పండు అరటి పండు. ఇది అన్నివయసుల వారకీ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుత ఫలం. ఒక్క అరటి పండు తింటే 3 యాపిల్‌ పండ్లు లేదా ఒకటిన్నర గుడ్డు తిన్నట్లే అంటారు. ఈ పండులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పొటాషియం, ఇతర మినరల్స్‌ శరీరానికి ఎంతో అవసరం. అరటిపండు తింటే బరువు తగ్గుతారు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది జపాన్‌ శాస్త్రవేత్త నిర్ధారించిన తాజా అధ్యయనం. అరటి పండుపై తాను స్వయంగా పరిశోధన జరిపిన తర్వాతే ప్రపంచానికి వెల్లడించారు. బనానా బెన్ఫిట్స్‌ ఇంకా చాలనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. – ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అరటి ద్వారా అందే పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. – అరటిలోని పొటాషియం, మెగ్నీషియం నరాలను ఉత్తేజపరచి రక్తప్రసరణ వేగాన్ని పెంచి  రక్తపోటును నియంత్రిస్తాయి. – నిద్రలేమి బాధితులు రాత్రి పడుకోబోయే ముందు పాలతోపాటు అరటి పండు తింటే కంటినిండా నిద్రపడుతుంది. – నోటిపూత సమస్య ఉన్నప్పుడు 25 గ్రాముల అతి మధురం అరటి గుజ్జుతో తీసుకుంటే నోటి పూత తగ్గుతుంది. – అరటిపండ్లలో పుష్కలంగా లభ్యమయ్యే బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటినుంచి లభించే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నుంచి విముక్తి పొందుతారు. – కడుపులోని అల్సర్లను మాన్పటంతో బాటు అజీర్తి సమస్యను అరటి తోడ్పడుతుంది. – బలహీనంగా ఉన్న పిల్లలకు పాలు, తేనెతో పాటు అరటిపండు తినిపిస్తే తగినంత బరువు పెరుగుతారు. – క్రీడాకారులు, కఠినమైన వ్యాయామాలు చేసే వారు అరటిపండు తింటే త్వరగా నీరస పడరు. – అరటి పండులో అధిక కార్బోహైడ్రేట్‌లు లభిస్తాయి. జీర్ణమయ్యే వేగం తగ్గువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఒక అరటి పండుతో సరిపెట్టుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు.