Diabetes: తిన్న వెంటనే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయి.? అసలు కారణం ఏంటంటే..

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డయాబెటిస్‌తో బాధపడేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తెలిసిందే. ఆహారం తిన్నవంటెనే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ తిన్నవెంటనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు..

Diabetes: తిన్న వెంటనే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎందుకు పెరుగుతాయి.? అసలు కారణం ఏంటంటే..
Diabetes
Follow us

|

Updated on: Aug 12, 2024 | 11:43 PM

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డయాబెటిస్‌తో బాధపడేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తెలిసిందే. ఆహారం తిన్నవంటెనే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ తిన్నవెంటనే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? పెరగకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం చేసిన వెంటనే శరీరంలో గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. దీనిని పోస్ట్‌ప్రాండియల్ హైపర్‌గ్లైసీమియా అంటారు. ఈ సమస్యను త్వరగా సరిదిద్దకపోతే ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో ఉన్నట్లుండి షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి విధానాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఒక ఆహార పదార్థం రక్తంలో ఎంత త్వరగా కరిగి షుగర్‌ స్థాయిని పెంచుతుందో తెలియజేసేదే.. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ ఇండెక్స్‌ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. తక్కువ ఇండెక్స్‌ ఉండే.. తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పిండి లేని కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇర తీసుకునే ఆహార విధానం ద్వారా కూడా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెంగా తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

* తిన్న వెంటనే కదలకుండా కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అందుకే తినగానే కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓట్స్‌, చియా సీడ్స్‌‌, కూరగాయలు వంటి ఫైబర్‌ ఉండే ఆహారాలను తీసుకోవాలి.

* రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణంలో ఉంచడంలో నీరు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 గ్లాసు నీరు తాగాలి. డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
పాదచారులకు కూడా లేని భద్రత.. దిమ్మతిరిగేలా చేస్తున్న వీడియో.!
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
ప్రధానితో పసిపాప పరాష్కం | తుపాకులను అంట్లు తోమినట్టు తోముడు.
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
డ్యామ్‌ గేట్లు చైన్‌ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
60 ఏళ్ల వయసులో ఇలాంటి పనులు ఏంటి? వాణి తండ్రి రాఘవరావు రియాక్షన్.
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
హంతకుడిని పట్టించిన హెడ్ సెట్! డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడు
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
భూమికోసం పొలంలో కుటుంబం ఆమరణ నిరాహారదీక్ష! లోకేష్ న్యాయం చెయ్యలని
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి గుడ్ న్యూస్.! ఏపీ, తెలంగాణలో..
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
పిల్లి కరిచి రేబిస్ బారిన పడిన మహిళ మృతి.! ఐదు డోసులకి బదులు ఒకటే
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..
నీటిలో నిలుచుని భారత్‌లోకి వస్తామంటూ వేడుకోలు! బీఎస్‌ఎఫ్‌ అడ్డం..