Penis Infection: పురుషాంగంలో ఇన్ ఫెక్షన్.. ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు..

ప్రస్తుత కాలంలో జననాంగాల్లో ఇన్ ఫెక్షన్లు రావడం సర్వ సాధారణమై పోయింది. జననాంగాల్లో ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా మహిళల్లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పురుషుల్లో కూడా వస్తున్నాయి. కానీ ఈ సమస్యల గురించి బయట మాట్లాడటానికి చాలా మంది ఇబ్బందులు పడి.. సమస్యను తీవ్రతరం చేసుకుంటున్నారు. ఫంగస్‌ల వల్ల పురుషుల జననాంగాల్లో కూడా ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. మూత్రానికి వెళ్లిన సమయంలో మంట, ఎరుపెక్కడం, దురద ఎక్కువగా ఉండటం..

Penis Infection: పురుషాంగంలో ఇన్ ఫెక్షన్.. ఈ సింపుల్ చిట్కాలతో తగ్గించుకోవచ్చు..
Penile Infection
Follow us

|

Updated on: Aug 13, 2024 | 3:40 PM

ప్రస్తుత కాలంలో జననాంగాల్లో ఇన్ ఫెక్షన్లు రావడం సర్వ సాధారణమై పోయింది. జననాంగాల్లో ఇన్ ఫెక్షన్లు ఎక్కువగా మహిళల్లోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పురుషుల్లో కూడా వస్తున్నాయి. కానీ ఈ సమస్యల గురించి బయట మాట్లాడటానికి చాలా మంది ఇబ్బందులు పడి.. సమస్యను తీవ్రతరం చేసుకుంటున్నారు. ఫంగస్‌ల వల్ల పురుషుల జననాంగాల్లో కూడా ఇన్ ఫెక్షన్లు వస్తున్నాయి. మూత్రానికి వెళ్లిన సమయంలో మంట, ఎరుపెక్కడం, దురద ఎక్కువగా ఉండటం, నొప్పి, మంట కలగడం, దుర్వాసన రావడం, పురుషాంగంపై చర్మం పొలుసులుగా మారడం.. వంటి లక్షణాలు ఇన్ ఫెక్షన్‌ కిందుకు వస్తాయి. అయితే పురుషాంగంపై వచ్చే ఇన్ ఫెక్షన్ తగ్గించడానికి ఈ చిట్కాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

పెరుగు లేదా యోగర్ట్:

పెరుగు లేదా యోగర్ట్‌లు సహజ ప్రోబయోటిక్‌ ఆహారాలు. ఇందులో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. మీకు సమస్య ఉన్న ప్రాంతంలో పెరుగు లేదా యోగర్ట్ రాయండి. ఇలా రెండు లేదా మూడు గంటలకు ఒకసారి కొద్ది రోజులు రాస్తూ ఉండండి. ఇది ఇన్ ఫెక్షన్‌ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మీకు పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెల్లుల్లితో చేసిన ఆహారాలు తీసుకోండి. పచ్చి వెల్లుల్లి తిన్నా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వెల్లుల్లి, థైమ్ ఉన్న యాంటీ ఫంగల్ క్రీములు ఉపయోగించినా మరింత ప్రయోజనాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో కూడా ఔషధ గుణాలు ఎన్నో ఉంటాయి. చర్మానికి మేలు చేయడం కొబ్బరి నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. ఇందులో కూడా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. కొబ్బరి నూనెను సమస్య ఉన్న చోట రాసుకుంటే నొప్పి, మంట నుంచి ఉపశమనం ఇచ్చి.. ఇన్ ఫెక్షన్ తగ్గించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్:

పురుషాంగంలో వచ్చే ఇన్ ఫెక్షన్ తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా చక్కగా పని చేస్తుంది. నీళ్లలో కొన్ని చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రాసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ద్రోణి ఎఫెక్ట్.! ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.! మరోసారి ఆంక్షలు..
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
గుండెకు బ్యాండ్‌ ఎయిడ్‌.! వానపాముల నుంచి స్ఫూర్తి శాస్త్రేవేత్తలు
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
యువతను నిద్రపుచ్చే కొత్త వృత్తి.. రెండు చేతులా సంపాదన.!
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
బెంగళూరులో మహిళల వాష్‌రూం చెత్తబుట్టలో ఫోన్ పెట్టి కెమెరా ఆన్..
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
డ్రైవర్‌ లెస్‌ కార్‌లో ప్రయాణించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. వీడియో.
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఆకాశం నుంచి సంధ్యా సమయాన్ని చూడాలనుందా.? అదిరిపోయే వీడియో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
ఫోన్ ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.. కరెంట్ హీటర్‌ను చంకలో..
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
చికెన్‌ వండి నెమలి కూర అంటూ ప్రచారం.. యూట్యూబర్‌ అరెస్ట్‌.!
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.
కర్నాటకలో వైభవంగా గాడిదలకు పెళ్ళి.. చూసేందుకు ఎగబడ్డ జనం.