AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raksha Bandhan: మీ సిస్టర్ ఇష్టపడే బెస్ట్ గిఫ్ట్ సెట్స్ ఇవే.. ధర రూ. 1000లోపే..

సోదరీమణులకు బహుమతిగా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కష్టపడకండి.. మీరు ఇచ్చే గిఫ్ట్ ను చూడగానే సింపుల్ గా మీ సోదరి ముఖంలో చిరునవ్వును ఆస్వాదించాలనుకునే ప్రతి సోదరుడికి ఇవి బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్లు మీకు అందిస్తున్నాం. వీటి ధర కేవలం రూ. 1000లోపే ఉంటాయి. మీ సోదరి ఇష్టాలకు అనుగుణంగా ఈ వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

Raksha Bandhan: మీ సిస్టర్ ఇష్టపడే బెస్ట్ గిఫ్ట్ సెట్స్ ఇవే.. ధర రూ. 1000లోపే..
Rakhi Gift
Madhu
|

Updated on: Aug 14, 2024 | 10:27 AM

Share

మన దేశంలో కొన్ని ప్రాముఖ్య పండుగలు ఉంటాయి. వాటికి అందరూ అధిక ప్రాధాన్యం ఇస్తారు. కుల, మతాలకు అతీతంగా కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు. అలాంటి పండుగల్లో ప్రధానమైనది రాఖీ పండుగ. రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. ఇది తోబుట్టువుల మధ్య ప్రేమ, రక్షణకు భరోసా ఇస్తూ వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే సందర్భం. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ రానుంది. ఆ రోజు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీని కట్టి తన ప్రేమను కనబరుస్తారు. అదే సమయంలో సోదరులు తమ అనుబంధానికి గుర్తుగా కొన్ని బహుమతులు వారికిచ్చి వారిని సంతోషపరుస్తారు. ఈ బహుమతిని ఏదో సాదాసీదాగా కాక, గుర్తుండిపోయేదిగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే చాలా మందికి అందుకు తగిన బడ్జెట్ ఉండదు. అయితే ఈ కథనం మీకు అనువైన బడ్జెట్లో మీ సోదరీమణులకు ఇవ్వదగిన కొన్ని బెస్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇవి చెల్లి లేదా అక్కలకు తప్పనిసరిగా నచ్చుతాయి. పైగా వీటి ధర కేవలం రూ. 1000లోపే ఉంటాయి. అమెజాన్ ఆన్ లైన్ ప్లాట్ ఫారంలో కొనుగోలు చేయొచ్చు.

వారి ఇష్టాలను ప్రతిబింబించేలా..

సోదరీమణులకు బహుమతిగా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కష్టపడకండి.. మీరు ఇచ్చే గిఫ్ట్ ను చూడగానే సింపుల్ గా మీ సోదరి ముఖంలో చిరునవ్వును ఆస్వాదించాలనుకునే ప్రతి సోదరుడికి ఇవి బెస్ట్ గిఫ్ట్ ఆప్షన్లు మీకు అందిస్తున్నాం. వీటి ధర కేవలం రూ. 1000లోపే ఉంటాయి. మీ సోదరి ఇష్టాలకు అనుగుణంగా ఈ వీటిని ఎంపిక చేసుకోవచ్చు. మీరిచ్చే ఈ బహుతిలో ప్రేమ, సంరక్షణ రెండూ కలగలిపి ఉండేలా ఈ జాబితాను అందిస్తున్నాం.

  • రెనీ బాత్ & బాడీ కేర్ సెట్(RENEE Bath & Body Care Set) మీ సోదరీమణుల సౌందర్యాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. పూల-సువాసన కలిగిన బాడీ వాష్, ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్, హ్యాండ్ క్రీమ్‌తో విలాసవంతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇవన్నీ ప్రీమియం బహుమతి కాంబోతో ప్యాక్ చేసి అందించవచ్చు.
  • బ్రయాన్ అండ్ కాండీ సెంటెడ్ క్యాండిల్స్ గిఫ్ట్ సెట్( Bryan & Candy Scented Candles Gift Set). ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ గిఫ్ట్ ఆర్టికల్. ఇది సువాసనలతో అందిస్తుంది: లావెండర్ అండ్ చమోమిలే, నెరోలి అండ్ హనీకోంబ్. ఇది మూడ్ స్వింగ్ ను అందిస్తుంది. ఇంట్లో సుగంధాల గాలిని పంచుతుంది.
  • షైనింగ్ దివా ఫ్యాషన్ 18కే రోజ్ గోల్డ్ ప్లేటెడ్ జిర్కాన్ చెవిపోగులు( Shining Diva Fashion 18k Rose Gold Plated Zircon Earrings). ఇవి 18కే మైక్రో గోల్డ్ ప్లేటింగ్, సహజ జిర్కాన్ స్ఫటికాలతో అద్భుతమైన డిజైన్‌తో ఆకర్షిస్తాయి. ఈ చెవిపోగులు కచ్చితంగా మీ సోదరీ మణులకు కొత్త అందాన్ని చేకూరుస్తాయి. పైగా వారికి ఆనందాన్ని అందిస్తాయి.
  • షాపీ విడ్ పీయూ లెదర్ ఉమెన్స్ బ్యాక్‌ప్యాక్( ShopyVid PU Leather Women’s Backpack). అడ్జస్ట్ బుల్ పట్టీలు. సొగసైన నలుపు డిజైన్‌ను కలిగి ఉంటుంది. అధిక నాణ్యత గల పీయూ తోలుతో రూపొందించబడిన ఈ మన్నికైన బ్యాక్‌ప్యాక్ రోజువారీ వినియోగానికి, ప్రయాణానికి అనువైనదిగా ఉంటుంది.
  • లావీ వుమెన్స్ ఓవల్ ఫ్రేమ్ క్లట్చ్(Lavie Women’s Oval Frame Clutch). ఇది ప్రత్యేకమైన హ్యాండ్ బ్యాగ్. ఇది స్పెషల్ అకేషన్స్ కి సరిగ్గా సరిపోతుంది. మీ సోదరీమణులకు అదనపు అందాన్ని జోడిస్తుంది. వారి ఉపకరణాలను అందులో ఉంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. దాని ఫాక్స్ లెదర్ అవుట్ లుక్ చాలా అందంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..